శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 29 జులై 2021 (11:19 IST)

తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు మరోసారి పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. గాంధీ ఆస్పత్రిలో కరోనా వార్డు బాధితులతో నిండిపోయింది.

గాంధీకి రోజుకు 50 వరకు సివియర్ కేసులు వస్తున్న పరిస్థితి నెలకొంది. వారం క్రితం వరకు గాంధీలో రోజుకు 20 వరకు మాత్రమే కరోనా అడ్మిషన్లు నమోదు అయ్యాయి.

కాగా మళ్లీ కేసులు పెరుగుతుండడంతో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. తెలంగాణలో వరుస పండుగలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.