గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శుక్రవారం, 9 జులై 2021 (10:32 IST)

తెలంగాణలో ఇంటర్‌ ప్రవేశాల గడువు 31 వరకు పెంపు

తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెడ్‌, ఇతర అన్ని రకాల గురుకులాల్లో ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు నిర్వహించుకునే గడువును ఈనెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ తెలిపారు.

దీనికి అనుగుణంగా ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. కొన్ని ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు ఇంటర్‌బోర్డు అనుబంధ గుర్తింపు లేకుండా, అనధికారిక భవనాల్లో తరగతులు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు అందాయని ఆయన తెలిపారు.

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించొద్దని స్పష్టం చేశారు.