శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 5 జులై 2021 (07:37 IST)

చవట సన్నాసుల్లా పిచ్చికబుర్లు చెప్పడం మానేయండి: కొమ్మారెడ్డి పట్టాభిరామ్

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతర వైసీపీనేతలకు వారుచేసిన తప్పుడుపనులకు ఎప్పుడైతే ప్రజలనుంచి సెగతగులుతుందో,  ఎప్పుడైతే వారిప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలుతుందని, అనిపిస్తుందో అప్పుడు ప్రతిపక్షంపై  కొత్తకొత్త ఆరోపణలు చేస్తుంటారని, చంద్రబాబు నాయుడు,నారాలోకేశ్ సహా, ఇతరటీడీపీనేతలపై నోటికొచ్చినట్లు అడ్డగోలుగా  మాట్లాడుతుంటారని, టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. 

 
ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.  ఆ వివరాలు ఆయనమాటల్లోనే యథాతథంగా మీకోసం...!

తాజాగా రాజధాని అసైన్డ్ భూములకు సంబంధించి, చంద్రబాబునాయుడు,ఇతర టీడీపీనేతలపై పాలకపక్షంలోని వారుచేసిన అసంబద్ధ, నిరాధార ఆరోపణలు ఆ కోవలోకే వస్తాయి. ముఖ్యమంత్రికి, తాడేపల్లి ప్యాలెస్ కు ఎంత సెగ తగులుతుందో గతకొద్దిరోజులనుంచీ గమనిస్తూనేఉన్నాం.  పాలకులుచేస్తున్న అవినీతి, దోపిడీకి సంబంధించిన ఆధారా లుకూడా ఎప్పటికప్పుడు బయటపడుతున్నాయి.

గతంలో వీరుచేసిన అనేక అరాచకాలకు సంబంధించిన విచారణలు కూడా వేగవంతమవుతున్నాయి. ఇలాంటిపరిస్థితుల్లో ఏదో ఒకటిచేసి, ప్రజలదృష్టి మరల్చాలనే తాడేపల్లి ప్యాలెస్ లోని స్క్రిప్ట్ రైటర్లు తప్పుడుస్క్రిప్టులు వదులుతుంటారు. వై.వీ.సు బ్బారెడ్డి కుమారుడైన విక్రాంత్ రెడ్డి అనుంగు అనుచరుడైన లవకుమార్ రెడ్డి టెలిఫోన్ సంభాషణ నిన్నటినుంచి సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది.

ఉత్తరాంధ్రలో 15వేలకోట్ల బాక్సైట్ దోపిడీకోసం ఏకంగా అటవీప్రాంతంలో పెద్దరోడ్డే వేసేస్తున్నారు. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రే తనఇసుక దోపిడీకోసం స్వయంగా రూ.150కోట్లతో కరకట్ట విస్తరణ పేరుతో రాజమార్గా నికి శంఖుస్థాపన చేశాడు. ముఖ్యమంత్రి చేసిన తప్పుడుపనులన్నింటికి సంబంధించి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ వ్యాఖ్యలు, చేతలపై కేంద్రహోంశాఖ దర్యాప్తు నకుఆదేశించడం జరిగింది.

దానికితోడు హూ కిల్డ్ బాబాయి ప్రశ్నఉండనే ఉంది. ఆప్రశ్నకు సమాధానంకోసం రాష్ట్రమం తా ఎదురుచూస్తోంది. ఇలాంటి అనేకసెగలతో ముఖ్యమంత్రి కి ఊపిరాడటంలేదు. దాంతో ఏంచేయాలో పాలుపోక దిక్కు తోచనిస్థితిలోపడిన తాడేపల్లి మాయలఫకీర్ రాత్రిపూట ఆత్మలతో మాట్లాడుకుంటూ, పగటిపూట టీడీపీపై తప్పుడు స్క్రిప్ట్ లు వదులుతున్నాడు.

ఆ స్క్రిప్ట్ ఏంటయ్యా అంటే పాత ఆవుకథే. రాజధానిలో ఏదో జరిగిపోయింది.. అమరావ తిలో చంద్రబాబునాయుడుతనబినామీల పేరుతో పెద్దఎత్తున దోచుకున్నాడు.. దళితులకు చెందినఅసైన్డ్ భూములను కాజేశాడని కట్టుకథలు అల్లడం ప్రారంభించారు. అలాంటి కట్టుకథలకు పెట్టిందిపేరు కరకట్ట కమల్ హాసన్. మీడియా ముందు అద్భుతంగా నటిస్తుంటాడు. వారికి సపోర్ట్ చేయడా నికి కొన్ని మీడియా ఛానల్స్. 
ఆళ్లరామకృష్ణారెడ్డికి, వైసీపీనేతలైన కొందరు చచ్చుసన్నా సులకు ఒకటే చెబుతున్నాం.

అధికారంలోకి వచ్చి రెండేళ్లైం ది.. తప్పుడు ఆరోపణలు చేయడం తప్ప, ఆధారాలకు సంబంధించి చిన్నకాగితం ముక్కైనా బయటపెట్టారా? అసైన్డ్ భూములు ఇతరులపేర్లతో రిజిస్ట్రేషన్ జరిగాయి... దళితులకు తీరని అన్యాయం జరిగింది..  చంద్రబాబునాయుడు అంత దోచాడు..ఇంతదోచాడు అనే సన్నాసులు ఒక్కఆధారమైనా బయటపెట్టారా?అసైన్డ్ భూములు ఇతరులపేర్లపై ట్రాన్స్ ఫర్ అవుతాయా? అలా ఏరోజు ట్రాన్స్ ఫర్ కావు. అది అందరికీ తెలిసిందే.

ఇక ప్యాకేజీ గురించి మాట్లాడితే, రాజధానికి రైతులిచ్చిన 33వేల ఎకరాల్లో 3వవంతు భూమి,స్వచ్ఛందంగా దళితులుఇచ్చిం దే. ఆభూమికి సంబంధించి దాదాపు 63,410 ప్లాట్లు (రెసిడెన్షియల్,కమర్షియల్ కలిపి) టీడీపీ ప్రభుత్వంలో భూయజమానులకు ఇవ్వడం కూడా జరిగింది.  63,410 రిటర్న్ బుల్ ప్లాట్స్ కాకుండా, వేరే ఏరకమైన పరిహారమైనా,   ఎక్కడైనా దళితులకు ఇచ్చిందిలేదు.

ప్రభుత్వంపై ఎలాంటిభారం పడకుండా గతప్రభుత్వం, రాజధానికి 33వేలఎకరాలు సేకరించిది. 63,410 ప్లాట్లలో భూమిచ్చినవారు కాకుండా,ఇతరుల పేరుతో ఎక్కడైనా ఒక ప్లాట్ ఇచ్చినట్లు ఈవైసీపీ సన్నాసులు రుజువుచేయగలరా? రెండేళ్లనుంచి ఇదే అడుగుతున్నా ...చెప్పిన కట్టుకథలే మళ్లీ,మళ్లీ చెబుతున్నారు. చవట సన్నాసుల్లా పిచ్చికబుర్లు చెప్పడం మానేయండి.

సీఆర్డీఏ రికార్డులు మీప్రభుత్వం దగ్గరే ఉన్నాయికదా.. దానికి సిట్ లు,సీఐడీలు, రఘురామరెడ్డి అనే ప్రత్యేకఅధికారి, మంత్రుల కమిటీలు ఇన్నికావాలా? ఇన్నివ్యవస్థలు మీచేతుల్లో ఎం దుకు ఉంచుకున్నారు? ఎవరిపేరుతో ఎన్నిప్లాట్లున్నాయి.. ఎవరు భూమిలిచ్చారనేది తెలుసుకోవడానికి ఎంతసమయం కావాలి. భూములిచ్చినవారు కాకుండా,ఇతరులపేర్ల తో ఎక్కడాఎవరికీ  ఒక్కప్లాట్ కూడా ఇవ్వలేదు.

ఈ వాస్తవం తెలిసికూడా కావాలనే బురదజల్లడంకోసం తప్పుడు వ్యా ఖ్యానాలు చేస్తున్నారు. అసైన్డ్ భూములను ట్రాన్స్ ఫర్ చేయడమే కుదరుదు. చంద్రబాబునాయుడిప్రభుత్వం 01-01-2015 లో విడుదలచేసిన జీవోనెం-1లో పట్టాభూముల యజమానులతోపాటు, అసైన్డ్ భూముల యజమానులకు కూడా సమానంగా ప్యాకేజీఇస్తామనిచెప్పారు.

జరీబుభూములకు రెసిడెన్షియల్ ప్లాట్ 800గజాలు, కమర్షియల్ ప్లాట్ 200 గజాలుఇస్తామని జీవోనెం-1లో చెప్పారు. అసైన్డ్ భూములకు సంబంధించి దళితులకు న్యాయంచేసిన ఘనత చంద్రబాబునాయుడిదే. అంతటితో ఆగకుండా, ఇంకామెరుగ్గా అసైన్డ్ భూ యజమానులకు న్యాయంచేయడం కోసం జీవోనెం-1కి కొనసాగింపుగా, జీవోనెం-41 తీసుకొస్తే, దాన్నికూడా వైసీపీసన్నాసులు తప్పుపడుతున్నారు.

దానిలోతప్పేముందయ్యా.. దళితుల కు మెరుగైన పరిహారమిస్తే, ఎందుకంతలా ఏడ్చిచస్తున్నా రు? దళితులు ఆర్థికంగా బలపడటాన్ని జీర్ణించుకోలేకపోతు న్నారా? జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి దళితుల అసైన్డ్ భూములుకాజేసి, నిలదీశాక, అయ్యయ్యో తప్పయిం దని అసెంబ్లీలో ఒప్పుకున్నది నిజంకాదా? అసైన్డ్ భూము లను కబ్జాచేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది, ఆయన కుటుం బానిదే. కొందరుఅధికారులు ఉన్నట్టుండి నిజాలుచెబుతు న్నారంట..ఇంకా ఏదో రుజువుచేస్తామని ఆళ్లరామకృష్ణారెడ్డి చెబుతున్నాడు.

అనాడు చంద్రబాబునాయుడి హాయాంలో పనిచేసిన అధికారులే ఇప్పుడు మీప్రభుత్వంలో ఉన్నారు. నిజంగా ఏదైనా తప్పుజరిగితే సదరు అధికారులు నోట్ ఫైల్ పై రాస్తారుకదా? అలాంటివన్నీ మీ దగ్గరేఉన్నాయి.. ప్రభు త్వమే మీది. అయినా ఏంసాధించారు? ఆళ్ల మీడియాతో మాట్లాడుతూ, పిచ్చిపిచ్చిగా పాగల్ గాడిలా మాట్లాడాడు. కాసేపు రికార్డులు లేవంటాడు.. కాసేపు రికార్డులన్నీతమ దగ్గరే ఉన్నాయంటాడు. ఏంది ఆయన లొల్లి.

రికార్డులు బ యటకు తీస్తే ఎవరుబినామీలో తేలుతుందికదా? అవిబయ టపెట్టినా ఏంకాదు. ఎందుకంటే ఒక్కప్లాట్ కూడా బినామీల పేరుమీదఇచ్చినట్టుఎక్కడా లేదు. అలాఇచ్చినట్టు ఈప్ర భుత్వం ఇంతవరకు రుజువుచేయలేకపోయింది. చేయలేదు కూడా. చంద్రబాబునాయుడు ప్లాట్ లుఇవ్వడమే కాకుండా, వాటిని అమ్ముకొని, తమ బిడ్డల భవిష్యత్ బాగుచేసుకునే వెసులుబాటు కల్పించారు. మీరు, మీప్రభుత్వంజీవోనెం – 41 ని తప్పుపడుతున్నారు..

మరి మీ ప్రభుత్వం 21-01-2020న ఇచ్చిన జీవోనెం-72 పరిస్థితేమిటి? విశాఖపట్నంలో ఇళ్లపట్టాలకోసం ఇచ్చిన జీవోనెం-72 సంగతేంటి? విశాఖపట్నం, అనకాపల్లి డివిజన్లలో 2,552 ఎకరాల అసైన్డ్ భూములను దళితులను చితకబాదిమరీ లాక్కున్నారు. అక్కడేమోఇష్టమొచ్చినట్లు దళితుల భూములుగుంజుకొని, ఇక్కడేమో దళితులభూము లుకాజేశారని మొసలికన్నీరు కారుస్తారా?

550 రోజులుగా  అమరావతి ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నది మా దళితసోదరులే. వారికి నిజంగా అన్యాయంజరిగితే అలాచేస్తా రా? విశాఖపట్నం, అనకాపల్లి డివిజన్లతో ఈప్రభుత్వ భూముల గుంజుడు కార్యక్రమం ఆగలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లపట్టాలపేరుతో ఇంకెన్ని ఎకరాలు లాక్కున్నారో చెప్పం డి. గతంలో తండ్రి ముఖ్యమంత్రి పదవిని అడ్డంపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఎస్ఈజెడ్ లపేరుతో దళితుల భూముల గుంజుకున్నాడు.

ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇంకా ఎక్కువగా అసైన్డ్ భూములను కాజేస్తున్నాడు.  ఈ ముఖ్య మంత్రి, ఆళ్లరామకృష్ణారెడ్డి, సజ్జలరామకృష్ణారెడ్డి జీవోనెం-41 గురించి మాట్లాడేముందు, జీవోనెం-72పై సమాధానంచెప్పా లి. గతంలోకూడా రైతులుమాకు ఫిర్యాదుచేశారని చెప్పారు. మేంఎవరిపైనా ఫిర్యాదుచేయలేదని రైతులుచెప్పిన వాస్తవా లను వీడియోలతో సహా, బయటపెట్టాము. దాంతో ఆనాడు తోకముడిచి,ఇప్పుడు మరలా జాడిస్తున్నారు.

ముఖ్యమం త్రి ప్రతిరాత్రీ ఎన్నిఆత్మలతో  మాట్లాడినా, చంద్రబాబునాయు డిపై, టీడీపీనేతలపై బురదజల్లడం సాద్యపడదు. ఏఆత్మ చెప్పిందని గతంలో ఈముఖ్యమంత్రి కొల్లురవీంద్ర, అచ్చెన్నా యుడు, ధూళిపాళ్ల నరేంద్రలపై కేసులుపెట్టాడు. రోజురోజుకీ అవినీతిమురికికూపంలో కూరుకుపోతున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావాలనే ఆధారాలులేకుండా చంద్రబాబుపై,ఇతర టీడీపీనేతలపై తప్పుడు ఆరోపణలు చేస్తోంది. 4వేల ఎకరాలు కాజేశారన్నారు.

4గజాలు చూపించమంటే ఎక్కడా ఏమీ మాట్లాడరు.  పాడిందే పాటరా.. పాచిపళ్లదాసుడా అన్నట్లు లేనిదాన్ని సృష్టిస్తూ, అవినీతిసొమ్ముతో పెట్టిన పత్రికలో విషప్రచారంచేస్తారా? ఏదోజరిగిపోయిందని అభూత కల్పనలు సృష్టించే ప్రయత్నాలు మానుకోండి. దళితులను మాయచేసి, మభ్యపెట్టి అసైన్డ్ భూములను కాజేసి, ఎక్కడై నాఇతరులకు ఒక్కప్లాట్ ఇచ్చినట్టైనా రుజువుచేయగలరా?

33వేలఎకరాల తాలూకాదాదాపు  63వేల రిటర్నబుల్ ప్లాట్ల లో ఒక్కప్లాట్ అయినా అలాంటిది ఉందని రుజువుచేయగ లరా? రమ్మంటే రేపే సీఐడీ కార్యాలయానికి వస్తా.. తాడేపల్లి ప్యాలెస్ కు రమ్మన్నా వస్తా.. సజ్జల ముందు, మాయలఫకీర్ ముందు ఎక్కడకూర్చోమన్నా కూర్చుంటా. ఎవరిపేరుతోఎన్ని ప్లాట్లున్నాయో తేల్చేద్దాం.  63వేల ప్లాట్ల సమాచారం తీసుకోవడానికి ఎన్నేళ్లుపడుతుంది. రాష్ట్ర నాయకుడిలో ఏమాత్రం సీమపౌరుషం ఉన్నా, ఇప్పటికైనా తానువిసిరిని ఛాలెంజ్ స్వీకరించాలి. ఎన్నిసార్లు సవాల్ చేసి నా తోకముడవడమేనా? ఎన్నిసార్లు ఈ పంచాయితీ?

నిజం గా ప్రభుత్వందగ్గర, ఆళ్లరామకృష్ణారెడ్డి దగ్గర ఆధారాలుంటే కోర్టుల్లో కేసులు వేయమనండి. ఈ మాయలఫకీర్ తండ్రి కూడా చంద్రబాబునాయుడిపై అనేకకేసులు పెట్టి, చివరకు తోకముడిచాడు. ఈయనవల్ల ఏమవుతుంది? 60పైసల అవినీతినికూడా రుజువుచేయలేకపోయావు. ముఖ్యమంత్రి పతనంప్రారంభమైంది. ఎన్నిడ్రామాలాడినా.. ప్రజలను దారి మళ్లించడానికి ఎన్నిడ్రామాలాడినా తప్పించుకోలేవు.

ఇప్ప టికే నిరుద్యోగుల్లో నీ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైంది. వారితోపాటు,ఇంకా అనేకవర్గాలు రేపోమాపో మీకు గునపం దించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికైనా చంద్రబాబునా యుడిపై బురదజల్లడం మానుకో. ఆయన  వెంట్రుకకూడా టచ్ చేయలేరు. నువ్వు, కేసీఆర్ ఆడుతున్న నీళ్ల డ్రామా లను కూడా ప్రజలు గమనిస్తున్నారు. సిట్ లు, మంత్రుల ఉపసంఘాలు, సీఐడీలు చంద్రబాబునాయుడి వెంట్రుక కూడా టచ్ చేయలేవని తెలుసుకో మాయలఫకీర్.

బాధ్యత గలముఖ్యమంత్రిగా ప్రజలసమస్యలు పరిష్కరించడానికి పనిచేయ్.. అంతేగానీఇలాంటి ఆరోపణలతో పబ్బం గడుపు కోవాలనిచూడకు. వైసీపీనేతలుకూడా ఇవన్నీ గుర్తుపెట్టుకొ ని మసులుకుంటే మంచిది. చంద్రబాబునాయుడు ఏం చేసినా ఎక్కడా ఎలాంటిపొరపాట్లకు తావులేకుండా రాజధా ని నిర్మాణం చేపట్టారు. ఈ ముఖ్యమంత్రి భూము లిచ్చిన వారితోపాటు, ఇవ్వనివారి వీపులుకూడా పగులగొడుతున్నాడు.