సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 5 జులై 2021 (07:13 IST)

శ్రీనగర్‌లో డ్రోన్లు, మానవరహిత వాహనాలపై నిషేధం

జమ్ముకాశ్మీర్‌లోని శ్రీనగర్‌ జిల్లాలో డ్రోన్లు, ఇతర మానవరహిత విహంగ వాహనాలను ఉపయోగించడం, కలిగి ఉండటంపై నిషేధం విధించారు.

జమ్ముకాశ్మీర్‌ పరిపాలన విభాగం ఆదివారం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. వారం రోజుల క్రితం జమ్ములోని వైమానిక కేంద్రంపై డ్రోన్ల దాడి జరగడంతో ఈ నిషేధం విధించారు.

వాటివల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా ఈ నిషేధం విధించినట్లు శ్రీనగర్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ మహమ్మద్‌ అయిజ్‌ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇప్పటికే డ్రోన్‌ కెమెరాలు కలిగి ఉన్నవారు స్థానిక పోలీస్‌ స్టేషన్లలో సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.జమ్ముకాశ్మీర్‌లో ఇలాంటి నిషేధం విధించిన రెండో జిల్లాగా శ్రీనగర్‌ నిలిచింది. ఇప్పటికే రాజౌరి జిల్లాలో ఇలాంటి నిషేధం విధించారు.