మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 జులై 2020 (13:57 IST)

వైసీపీ నేత అక్రమ సంబంధం.. అలా వెలుగులోకి వచ్చింది..

వైసీపీ నేత అక్రమ సంబంధం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కృష్ణాజిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. బుగ్గవరం మండలం, పొందురు గ్రామంలో వైసీపీ నేత అక్రమ సంబంధం బయటపడింది. ఓ కానిస్టేబుల్ బంధువుతో వైసీపీ నేత సన్నిహితంగా ఉన్న విషయం తెలుసుకున్న పోలీస్.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించారు.
 
వైసీపీ నేతతో ఆ మహిళ గదిలో ఏకాంతంగా ఉన్న సమయంలో పోలీసుల సమక్షంలో తలుపు తీసి చూడగా ఆమె బయటకు రావడంతో అవాక్కయ్యారు. బయటకు వచ్చిన మహిళ నోటికొచ్చినట్లు బూతులు తిడుతూ కానిస్టేబుల్‌పై విరుచుకుపడింది. 
 
గొడవ జరగడంతో వారిద్దరు అక్కడినుంచి కారులో పరారయ్యారు. అధికారపార్టీ నేత రాసలీలలపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సాహసించలేదు. ఎలాంటి కేసు నమోదు కాలేదని ఎస్ఐ ఈశ్వరావు తెలిపారు.