గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Updated : గురువారం, 9 జులై 2020 (19:19 IST)

ఆ దర్సకుడితో రంగమ్మత్తకు చెడిందా? (Video)

బుల్లితెరమీదే కాదు వెండితెర మీద కూడా వెలుగొందుతోంది అనసూయ. జబర్దస్త్ తోనే ఆమెలోని టాలెంట్ బయటకు వచ్చింది. ఆ తరువాత అడపాదడపా సినిమాలు చేసేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది.
 
కరోనా సమయంలోను తన అభిమానులతో ఛాటింగ్ చేస్తూ సేఫ్ హోమ్ అంటూ చెబుతూ వచ్చింది. అయితే రంగమ్మత్తకు దర్సకుడు క్రిష్ణవంశీ అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. రంగమార్తాండ సినిమాలో రంగమ్మత్తుకు అవకాశం వచ్చింది.
 
అది కూడా కరోనాకు ముందే ఆమెకు ఈ అవకాశం లభించింది. ఇందులో ప్రకాష్ రాజ్, రమ్యక్రిష్ణలవి కీలక పాత్రలైతే అనసూయ పాత్ర కూడా కీలకమేనట. మరాఠీలో సూపర్ హిట్ అయిన సినిమా ఆధారంగా రంగమార్తాండ సినిమా తెరకెక్కుతోంది.
 
కరోనా పుణ్యమా అని రెండునెలల పాటు షూటింగ్ నిలిచిపోతే తెలంగాణా ప్రభుత్వ అనుమతితో ప్రస్తుతం మళ్ళీ షూటింగ్ లు ప్రారంభమయ్యాయి. అయితే షూటింగ్ లకు అనసూయ కూడా రెగ్యులర్ కూడా హాజరవుతోందట.
 
కానీ షూటింగ్ సమయానికి సరిగ్గా రాకపోవడం.. ఆలస్యంగా ఆమె రావడంతో దర్సకుడు క్రిష్ణవంశీతో వాగ్వాదం కూడా జరిగినట్లు కూడా తెలుస్తోంది. ఒకవైపు జబర్దస్త్ మరో వైపు సినిమాలతో బిజీ బిజీగా ఉండడం వల్ల ఆమెకు సమయం సరిపోవడం లేదట.
 
రంగమార్తాండలో అనసూయకు ఇచ్చిన క్యారెక్టర్ ఆమెకు కరెక్టుగా సరిపోతుందట. అయితే ఆమె మాత్రం షూటింగ్‌కు సరైన సమయానికి రాకపోవడంతో క్రిష్ణవంశీ వేరే యాక్టర్‌ను వెతుక్కోవడానికి సిద్ధమవుతున్నాడట. ఇప్పటికే అనసూయపై చేయాల్సిన సన్నివేశాలను పెండింగ్ పెట్టారట.