సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 మే 2020 (11:26 IST)

రామ్ చరణ్‌తో స్టెప్పులేయనున్న రంగమ్మత్త..

యాంకర్ అనసూయ ప్రస్తుతం రామ్ చరణ్‌తో కలిసి స్టెప్పులేయనుంది. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' పేరుతో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో రామ్ చరణ్ ముఖ్య పాత్ర పోషిస్తుండగా ఆయనతో కలిసి అనసూయ స్పెషల్ సాంగ్ చేయనుందనే టాక్ వినిపిస్తుంది. 
 
ఇప్పటికే ఈ సినిమాలో చిరుతో కలిసి రెజీనా మాస్ సాంగ్ చేయగా, అనసూయ స్పెషల్ డ్యాన్స్‌ చేయనుంది. ఈ సినిమాలో చరణ్‌కు చెల్లెలి పాత్రలో నిహారిక కొణిదెల నటించనుందని సమాచారం.
 
కాగా యాంకర్‌గా, నటిగా అలరిస్తున్న అనసూయ అప్పడప్పుడు స్పెషల్ సాంగ్స్‌తో అలరిస్తున్న సంగతి తెలిసిందే. సాయిధరమ్ తేజ్ నటించిన విన్నర్ సినిమాలో సూయ సూయ అంటూ చిందులేసిన అనసూయ.. ఎఫ్-2లోను స్పెషల్ సాంగ్‌తో అలరించింది. తాజాగా రామ్ చరణ్‌తో కలిసి స్టెప్పులేయనున్నట్టు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది.