1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. interesting news on chiranjeevi's aacharya

చిరు ఆచార్య మూవీలో ఇంట్రస్టింగ్ ట్విస్ట్ ఇదే..!

interesting news
మెగాస్టార్ చిరంజీవి - బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ఆచార్య. ఇప్పటివరకు అపజయం అనేది లేకుండా వరుసగా బ్లాక్‌బస్టర్స్ సాధిస్తున్న కొరటాల శివ సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పైన మరింత ఆసక్తి ఏర్పడింది. దీనికితోడు ఈ సినిమాలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తుండటంతో మెగా అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 
 
ఇందులో చిరు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది. ఈ మూవీలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే.. చరణ్ కూడా హీరోయిన్ ఉంటుందని కొరటాల చెప్పారు కానీ.. ఎవరనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదన్నారు. క్రేజీ హీరోయిన్ రష్మిక నటించే ఛాన్స్ ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. చరణ్‌ పాత్ర గురించి ఇప్పటివరకు అరగంట నిడివి ఉంటుందని వార్తలు వచ్చాయి కానీ.. అంతకుమించి ఎలాంటి వార్త బయటకు రాలేదు. 
 
తాజా వార్త ఏంటంటే... చ‌ర‌ణ్ పాత్ర చాలా ఉద్వేగ పూరితంగా ఉంటుందని తెలిసింది. అంతేకాకుండా.. ఈ సినిమాకి చరణ్ పాత్ర హైలెట్‌గా నిలుస్తుందని టాక్.
 
 ఈ కథలో ఇంట్రస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే... రామ్ చరణ్ గూండాల చేత చంపబడ‌తాడ‌ని, రామ్ చరణ్‌ను చంపిన గూండాలపై చిరంజీవి ప్రతీకారం తీర్చుకుంటాడ‌ని, కథలో వ‌చ్చే ట్విస్టులు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయని సమాచారం. ఆచార్య సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నాడని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.
About Writer
శ్రీ
తర్వాతి కథనం
లాక్‌డౌన్ ఆంక్షల మధ్య ముగిసిన రిషి కపూర్ అంత్యక్రియలు