మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (15:10 IST)

చిరు జాబితాలో ఆ దర్శకుడి పేరు గల్లంతు... సినిమా లేనట్టేనా?

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుసబెట్టి చిత్రాలు చేస్తున్నారు. "ఖైదీ నంబర్ 150"తో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. ఆ తర్వాత 'సైరా నరసింహా రెడ్డి'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇపుడు సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో "ఆచార్య" అనే చిత్రంలో నటించనున్నారు. 
 
ఈ చిత్రం తర్వాత మలయాళ చిత్రం లూసిఫర్ రీమేక్ చిత్రంలో నటించనున్నారు. ఇలా వరుసబెట్టి చిత్రాలు చేసేందుకు ప్లాన్ వేసుకున్నారు. ఆ తర్వాత డైరెక్టర్ బాబీ, మెహర్ రమేష్, హరీష్ శంకర్, సుకుమార్‌లతో కథా చర్చలు జరిగాయని తెలిపారు. మంచి కథతో వస్తే వారితో సినిమా ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ లిస్ట్‌లో చిరంజీవితో సినిమా ప్రకటించిన దర్శకుడి పేరు లేకపోవడం ఇపుడు ఫిల్మ్ నగర్‌లో చర్చనీయాంశంగా మారింది. 
 
ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో కాదు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అవును ఆ మధ్య చిరంజీవి, రామ్ చరణ్‌లు త్రివిక్రమ్‌తో సినిమా ఉంటుందని చెప్పారు. 'సైరా' తర్వాత కొరటాలతో, ఆ తర్వాత త్రివిక్రమ్‌తో చిరంజీవి సినిమా అంటూ రామ్ చరణ్ కూడా ప్రకటించారు. 
 
అలాగే ప్రముఖ నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి కూడా మెగా మల్టీస్టారర్ అనౌన్స్ చేశారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో చిరంజీవి, పవన్ కల్యాణ్‌తో సినిమా చేస్తానని సుబ్బరామి రెడ్డి తెలిపి ఉన్నారు. మరి దీని సంగతి ఏమైందో తెలియదు. ఇప్పుడు చిరు తెలిపిన డైరెక్టర్స్ లిస్ట్‌లో కూడా త్రివిక్రమ్ పేరు లేదు. సో.. చిరు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మూవీ ఇప్పట్లో లేనట్టేనని ఫిల్మ్ నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.