చిరు.. సుజిత్‌కి ఛాన్స్ ఇవ్వడం వెనకున్న సీక్రెట్ ఇదే
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా తర్వాత మలయాళంలో విజయం సాధించిన లూసీఫర్ రీమేక్ చేయనున్నట్టు ఎనౌన్స్ చేసారు. ఈ సినిమా గురించి గత కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నప్పటికీ అఫిషియల్‌గా ప్రకటించలేదు. దీంతో ఈ సినిమా నిజమేనా..? కాదా..? అనే డౌట్ ఉండేది.
ఎప్పుడైతే... చిరంజీవి స్వయంగా లూసీఫర్ రీమేక్ చేస్తున్నాను అని ప్రకటించారో ఇక అప్పటి నుంచి ఈ సినిమా ఒరిజినల్‌కి తెలుగు రీమేక్‌కి మార్పులు చేస్తున్నారా..? లేదా...? ఇంతకీ చిరు క్యారెక్టర్ ఎలా ఉంటుంది..? వేరే హీరో క్యారెక్టర్ కూడా ఉంటుందట కదా.. ఆ పాత్రను ఎవరు పోషిస్తారు... ఇలా లూసీఫర్ రీమేక్ గురించి మరింతగా చర్చ మొదలైంది.
ముఖ్యంగా ఈ సినిమాకి దర్శకుడుగా సాహో సుజిత్‌ని ఎంపిక చేయడం ఆసక్తిగా మారింది. లూసీఫర్ రీమేక్ రైట్స్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సొంతం చేసుకున్నారు. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఈ రీమేక్‌కి డైరెక్ట్ ఎవరు అంటూ కొంతమంది దర్శకుల పేర్లు తెర పైకి వచ్చాయి. సుకుమార్, వినాయక్, శ్రీను వైట్ల, వంశీ పైడిపల్లి... ఇలా కొంతమంది పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.
ఆఖరికి సుజిత్‌కి ఛాన్స్ వచ్చింది. రన్ రాజా రన్ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమాకి ముందు ఓ షార్ట్ ఫిల్మ్ తీసాడు. ఆ షార్ట్ ఫిల్మ్ నచ్చి రన్ రాజా రన్ అనే సినిమా చేసే ఛాన్స్ ఇచ్చింది యు.వి.క్రియేషన్స్. అతని వర్క్ నచ్చడంతో రెండో సినిమాకే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. అది కూడా బాహుబలి తర్వాత ప్రభాస్‌ని డైరెక్ట్ చేసాడంటే... అతని టాలెంట్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.
అయితే.. సాహో సినిమా ఫ్లాప్ అయ్యింది. అయినప్పటికీ చిరంజీవి సుజిత్‌కి ఎలా అవకాశం ఇచ్చారంటే.. దీని వెనకున్న అసలు విషయం బయటకువచ్చింది. ఇంతకీ మేటర్ ఏంటంటే... సుజిత్‌కు ఛాన్స్ రావడం వెనుక ప్రభాస్, యూవీ క్రియేషన్స్ ఉన్నట్టు సమాచారం. సాహో సినిమా సక్సెస్ సాధించనప్పటికీ... సుజిత్ ట్యాలెంట్ పైన ప్రభాస్‌కు, యూవీ క్రియేషన్స్ సంస్థకు మంచి గురి కుదిరిందని... అంతేకాకుండా రామ్‌చరణ్‌కు బెస్ట్ ఫ్రెండ్ అయిన యూవీ క్రియేషన్స్ విక్రమ్.. సుజిత్‌ను రికమెండ్ చేశారని తెలిసింది. ఏదిఏమైతేనేం సుజిత్ లక్కీ ఛాన్స్ సొంతం చేసుకున్నాడు.