శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 ఏప్రియల్ 2020 (10:59 IST)

''భీమ్'' విసిరిన ఛాలెంజ్ స్వీకరించిన చిరు.. సవాల్ ఎవరికంటే?

Chiru
లాక్ డౌన్ కారణంగా సినీ ప్రముఖులు ఇంట్లోనే వుంటున్నారు. ఇందులో భాగంగా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా 'బీ ది రియల్ మెన్' అనే ఛాలెంజ్‌కి శ్రీకారం చుట్టారు. దీనికి నెటిజన్ల నుండి సినీ పరిశ్రమ నుండి మంచి స్పందన వస్తుంది. లాక్‌డౌన్ వలన పని మనుషులు రాకపోవడంతో మహిళలు ఇంటి పనులతో చాలా ఇబ్బంది పడుతున్నారు. 
 
ఈ సమయంలో ఇంటి పనులలో మనం పాలు పంచుకోవాలని సందీప్ ఈ ఛాలెంజ్ ప్రారంభించారు. ఇప్పటికే ఈ ఛాలెంజ్‌ని రాజమౌళి, రామ్‌చరణ్, ఎన్టీఆర్, సుకుమార్, కొరటాల శివ వంటి వారు స్వీకరించగా.. తాజాగా ఎన్టీఆర్ విసిరినా సవాల్‌ను మెగాస్టార్ చిరంజీవి స్వీకరించారు. ఇల్లు శుభ్రం చేసి తన చేత్తో దోసె వేసి తన తల్లి అంజనాదేవికి పెట్టారు. ఈ సందర్భంగా అంజనాదేవి.. చిరుకు దోశె తినిపించారు. 
 
'భీమ్‌(తారక్‌) ఇదిగో చూడు.. నేను రోజు చేసే పనులే.. ఇవ్వాళ మీ కోసం. ఈ వీడియో సాక్ష్యం' అని చిరు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఛాలెంజ్ పూర్తి చేసిన చిరు కేటిఆర్, సూపర్ స్టార్ రజనీకాంత్‌లను నామినేట్ చేశారు.