శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 ఏప్రియల్ 2020 (09:26 IST)

నేడు చంద్రబాబు 70వ పుట్టినరోజు - ప్రశంసలతో చిరంజీవి బర్త్‌డే ట్వీట్

తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన 70వ పుట్టినరోజు వేడుకలను సోమవారం జరుపుకుంటున్నారు. ఈయన 1950 సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీన చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో జన్మించిన విషయం తెల్సిందే.
 
చంద్రబాబు పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయనకు రాజకీయ, సినీ ప్రముఖులు, టీడీపీ శ్రేణులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే, మెగాస్టార్ చిరంజీవి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
"దశాబ్దాలుగా అహర్నిశం ప్రజాసేవలో కొనసాగుతున్న మీ సంకల్పబలం అనితరసాధ్యం. కలకాలం మీకు సంతోషాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించమని ఆ భగవంతుడిని కోరుతున్నాను. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు సర్. మీ దూరదృష్టి, కష్టపడే మనస్తత్వం, అంకితభావం అత్యున్నతమైనవి" అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. దీంతోపాటు గతంలో చంద్రబాబుతో ఓ వేడుక సందర్భంగా సరదాగా గడిపిన ఒక ఫోటోను షేర్ చేశారు.