శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (12:05 IST)

మా మమ్మి మమ్మల్ని ఇంకా 'రియల్ మ్యాన్‌'లా చూడట్లేదు .. హీరో ఆవేదన

కరోనా దెబ్బకు దేశం యావత్తూ లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. ఫలితంగా ప్రతి ఒక్కరూ తమతమ ఇళ్ళకే పరిమితమయ్యారు. అయితే, సెలెబ్రిటీలు మాత్రం ఈ లాక్‌డౌన్ సమయాన్ని హ్యాపీ గడిపేస్తున్నారు. తమ మధ్య వివిధ రకాల పోటీలు పెట్టుకుంటూ, అదే తరహాలో మిగిలినవారు కూడా చేయాలంటూ పిలుపునిస్తున్నారు. 
 
"అర్జున్ రెడ్డి" దర్శకుడు సందీప్ వంగా చేసిన 'బీ ది రియల్ మ్యాన్' ఛాలెంజ్ ఇపుడు టాలీవుడ్‌లో బాగా ట్రెండ్ అయింది. ఒక్కో స్టార్ హీరో ఈ ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ, మరికొందరు చేయాలంటూ టాస్క్ ఇస్తున్నారు. వారు కూడా తమ టాస్క్‌ను పూర్తిచేసి, ట్విట్టర్ ఖాతాలో వీడియోను షేర్ చేస్తున్నారు. 
 
ఈ ఛాలెంజ్‌లో భాగంగా, హీరో జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఛాలెంజ్ స్వీక‌రించిన డైరెక్టర్ కొర‌టాల శివ త‌న టాస్క్‌ పూర్తి చేశారు. దీనిని కొన‌సాగిస్తూ విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని స్వీక‌రించిమ‌ని కోరాడు. దీనిపై స్పందించిన విజ‌య్ దేవ‌ర‌కొండ.. "శివ స‌ర్‌, మా మ‌మ్మీ న‌న్ను పని చేయ‌నివ్వ‌ట్లేదు. నేను చేస్తే ప‌ని డబుల్ అవుతుంద‌ని" అంటుంద‌ని విజ‌య్ పేర్కొన్నాడు.
 
'ఇంట్లో ఇంకా రియల్ మ్యాన్‌లా చూడట్లేదు మమ్మల్ని. పిల్ల‌ల్లానే ట్రీట్ చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ ఈ లాక్‌డౌన్ స‌మ‌యంలో నా డే ఎలా గ‌డుస్తుందో తెలియ‌డం కోసం చిన్న వీడియో షేర్ చేస్తాను' అని విజ‌య్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.