శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 30 ఏప్రియల్ 2020 (16:29 IST)

మహేష్‌ బాబుతో అర్జున్ రెడ్డి డైరెక్టర్ సినిమా

సూపర్ స్టార్ మహేష్‌ బాబు ప్రస్తుతం గీత గోవిందం డైరెక్టర్ పరశురామ్‌తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. మే నెలాఖరున ఈ సినిమాని ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి మహేష్‌ బాబుతో సినిమా చేయనున్నట్టుగా అఫిషియల్‌గా ఎనౌన్స్ చేసారు. 
 
అయితే.. పరశురామ్‌తో చేస్తున్న సినిమా, రాజమౌళితో చేయనున్న సినిమా మధ్యలో మరో సినిమా చేయనున్నారు మహేష్‌ బాబు. ఆ సినిమాని ఎవరితో చేస్తారనేది ఆసక్తిగా మారింది. అయితే... రీసెంట్‌గా అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ మహేష్‌ బాబుని కథ చెబుతాను టైమ్ ఇమ్మని అడిగినట్టు సమాచారం. 
 
అర్జున్ రెడ్డి సినిమా చూసిన తర్వాత మహేష్‌ బాబు సందీప్ రెడ్డితో సినిమా చేయాలనుకున్నారు. వీరిద్దరి మధ్య రెండు మూడు సార్లు కథా చర్చలు జరిగాయి కానీ.. ప్రాజెక్ట్ సెట్ కాలేదు. కారణం ఏంటంటే... సందీప్ రెడ్డి చెప్పిన స్టోరీ మహేష్‌ బాబుకి నచ్చలేదు.

ఆ తర్వాత సందీప్ రెడ్డి బాలీవుడ్ వెళ్లి కబీర్ సింగ్ సినిమా చేయడం.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. దీంతో సందీప్ రెడ్డికి అటు బాలీవుడ్‌లోను ఇటు టాలీవుడ్‌లోను మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే... మహేష్ బాబుకి మరోసారి కథ చెప్పనున్నాడు సందీప్ రెడ్డి. మరి.. ఈసారైనా మహేష్ ని మెప్పిస్తాడో లేదో చూడాలి.