సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 ఏప్రియల్ 2020 (18:42 IST)

అలా మోసం చేసేవారు పెరిగిపోతున్నారు.. శ్రియ

చెప్పే కథకు తీసే కథకు సంబంధం లేదని తెలిస్తే.. అలాంటి పాత్రలు అస్సలు ఒప్పుకోనని హీరోయిన్ శ్రియ స్పష్టం చేసింది. ఇలాంటి అనుభవాలు ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువవుతున్నాయని చెప్పింది. వివాహానికి ముందు టాలీవుడ్‌కు అగ్ర హీరోయిన్‌గా వుండిన శ్రియ.. వివాహం చేసుకుని సెటిలైపోయింది. తన వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతోంది. పెళ్లైన తర్వాత కూడా కొన్ని స్పెషల్ సాంగ్స్‌లో శ్రియ నటించింది. స్పెషల్ పాటలకు కూడా మంచి ప్రాధాన్యత వుంటేనే ఒప్పుకుంటానని చెప్తోంది. 
 
అయితే, మంచి కథ దొరికితేనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తానని అంటోంది. ఒకటి రెండు లైన్ల కథ చెప్పి, మోసం చేయాలనుకునే వారికి 'నో' చెబుతున్నానని శ్రియ తెలిపింది. చెప్పే కథకు తీసే కథకు సంబంధం లేకుండా.. మోసం చేసే దర్శక నిర్మాతలు పెరిగిపోతున్నారని శ్రియ చెప్పుకొచ్చింది. స్పెషల్ సాంగ్స్ చేసేందుకు హీరోయిన్లు భయపడే సమయంలో వాటిని తాను చేశానని చెప్పింది. ఇలాంటి పాటల్లో నటిస్తే హీరోయిన్‌గా అవకాశాలు రావేమోనని హీరోయిన్లు భయపడేవారని... ఆ భయాలను పారద్రోలాలని తాను అనుకున్నానని శ్రియ తెలిపింది.