శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 20 జూన్ 2020 (20:38 IST)

భోజనం లేకున్నా ఉండగలను .. రెడ్‌వైన్ మాత్రం రోజూ తాగాల్సిందే...

ప్రతి రోజూ రాత్రిపూట భోజనం లేకున్నా ఉండగలను. కానీ రెడ్ వైన్ ఓ గ్లాస్ తాగకుండా మాత్రం ఉండలేను అని అంటోంది ప్రముఖ బుల్లితెర యాంకర్. ఆమె ఎవరో కాదు. రంగమ్మత్త. పేరు అనసూయ. 
 
ఇద్దరు పిల్లలకు తల్లిగా ఉన్న ఈమె.. హీరోయిన్లతో సమానమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఈ హాట్ యాంకర్ దశాబ్దకాలం క్రితమే పెళ్లి చేసుకున్నప్పటికీ తన గ్లామర్‌ను మాత్రం కాపాడుకుంటూ వస్తోంది. దీంతో మీ గ్లామర్ సీక్రెట్ ఏంటి అని మీడియా ప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపిస్తూ వచ్చారు. కానీ, ఆమె ఎపుడూ తన అందానికి గల సీక్రెట్‌ను బహిర్గతం చేయలేదు. ఈ క్రమంలో ప్రస్తుతం ఆమె ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో తన అందం వెనుక ఉన్న రహస్యాన్ని బహిర్గతం చేసింది. 
 
'ప్రతి రోజూ రాత్రి భోజనం బదులు నేను రెడ్‌వైన్, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాను. రోజూ ఓ గ్లాస్ రెడ్‌వైన్ తాగుతాను. రెడ్‌వైన్ ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా గుండెకు చాలా మేలు చేస్తుంది. ఆకలిగా ఉన్నప్పుడు నిద్ర పట్టదు. కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు నేను భోజనం బదులు రెడ్‌వైన్ తీసుకుంటా. అయితే, అందరికీ ఈ పద్ధతి వర్కవుట్ అవుతుందని చెప్పలేం. నాకు మాత్రం బాగా పనిచేసింది' అని అనసూయ భరద్వాజ్ చెప్పుకొచ్చింది.