రంగస్థల నటిగా అనసూయ.. ఊరూరా తిరుగుతూ..?

Anasuya
anasuya
సెల్వి| Last Updated: మంగళవారం, 31 మార్చి 2020 (16:11 IST)
యాంకర్ అనసూయ రంగస్థల నటిగా కనిపించనుంది. ఊరూరా తిరుగుతూ నాటకాలు ప్రదర్శించే ఓ కళాకారిమి పాత్రలో ఆమె కనిపించనుంది. డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న రంగమార్తాండ సినిమాలో అనసూయ ఈ పాత్రలో కనిపించనుంది.

ఈ సినిమా నటసామ్రాట్ అనే మరాఠీ సూపర్ హిట్ సినిమాకు తెలుగు రీమేక్. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. కృష్ణవంశీ సతీమణి రమ్యకృష్ణ ప్రకాష్ రాజ్ సరసన నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమాకు 'రంగమార్తాండ' అనే ఆసక్తికర టైటిల్ ఫిక్స్ చేస్తూ షూటింగ్ సమయంలోనే భారీ హైప్ క్రియేట్ చేశారు.

ఈ సినిమాలో జబర్దస్త్ బ్యూటీ అనసూయ రంగస్థల నటిగా కనిపించనుంది. గత సినిమాలతో పోల్చితే ఇందులో ఆమె లుక్ మరింత గ్లామరస్‌గా ఉంటుందని తెలిసింది. ఒరిజినల్ వెర్షన్‌లో నానా పటేకర్ పోషించిన పాత్రను తెలుగు వర్షన్‌లో ప్రకాష్ రాజ్ చేస్తున్నారు. దాదాపు 20 సంవత్సరాల తరువాత తన సతీమణి రమ్యకృష్ణను కృష్ణవంశీ డైరెక్ట్ చేయబోతుండటం విశేషం. ఈ సినిమాకు అభిషేక్ అండ్ మధు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.దీనిపై మరింత చదవండి :