శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (17:09 IST)

ప్రియుడి కోసం అంత పనిచేసింది.. చివరికి ఏమైంది..? పాము కాటేసిందా? విషం తాగేశారా?

ప్రేమించారు.. ఇంటి నుంచి బయటికొచ్చారు. కానీ ఆ ప్రేమ విషాదంలో ముగిసింది. ప్రాణానికి ప్రాణమైమ ప్రియుడు టాయిలెట్‌ కంటూ వెళ్లి నోట్లో నురగ కక్కుతూ కిందపడిపోయాడు. దీన్ని చూసి సహించలేని ప్రియురాలు ప్రియుడి

ప్రేమించారు.. ఇంటి నుంచి బయటికొచ్చారు. కానీ ఆ ప్రేమ విషాదంలో ముగిసింది. ప్రాణానికి ప్రాణమైమ ప్రియుడు టాయిలెట్‌ కంటూ వెళ్లి నోట్లో నురగ  కక్కుతూ కిందపడిపోయాడు. దీన్ని చూసి సహించలేని ప్రియురాలు ప్రియుడి నోట్లోని నురగను తీసి శ్వాస ఇవ్వాలనుకుంది.


చివరికి ప్రియుడి ప్రాణాలు కోల్పోగా.. ప్రియురాలి పరిస్థితి విషమంగా వుంది. వివరాల్లోకి వెళితే.. సిద్ధిపేటలోని బెజ్జంకి మండలం రేగులపల్లికి చెందిన సంతోష్ రెడ్డి (28), అదే గ్రామానికి చెందిన బి.రాణి గతకొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇంటి నుంచి బయటికొచ్చిన ఆ జంట సిద్ధిపేట కొత్త బస్టాండ్‌లోకి వచ్చారు. 
 
బస్టాండ్‌లో టాయిలెట్‌కి వెళ్లిన సంతోష్ రెడ్డి.. అకస్మాత్తుగా నురగలు కక్కుతూ పడిపోయాడు. అది గమనించిన ప్రియసి రాణి ఒక్కసారిగా నివ్వెరపోయింది. తన కళ్ల ఎదుటే ప్రేమించిన వ్యక్తి ప్రాణాలు పోతుండటం చూసి తట్టుకోలేకపోయింది. ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్న సంతోష్ రెడ్డిని చూసి రాణి విలపిస్తూ కాపాడే ప్రయత్నం చేసింది. అతడికి తన నోటితో శ్వాస అందిస్తూ.. నోటిలోంచి నురగ తీయబోయింది. 
 
బస్టాండ్‌లో వున్న వారంతా వారించిన వినలేదు. కొద్దిసేపటికే రాణి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం వారిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సంతోష్ రెడ్డి మృతి చెందగా, యువతి రాణి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

సంతోష్ రెడ్డి విషం తాగాడా లేకుంటే పాము కాటేసిందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. అయితే పెద్దలు కాదనడంతోనే వీరిద్దరూ కూల్ డ్రింక్స్‌లో విషం కలుపుకుని తాగారని వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలియజేశారు.