శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : సోమవారం, 2 ఏప్రియల్ 2018 (08:46 IST)

'నా బ్రెయిన్ నా శత్రువు' అంటూ టీవీ యాంకర్ సూసైడ్

'నా బ్రెయిన్ నా శత్రువు - నా ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదు' అంటూ సూసైడ్ నోట్ రాసిపెట్టి ఓ బుల్లితెర యాంకర్ బలవన్మరణానికి పాల్పడింది. ఆ యాంకర్ పేరు రాధికా రెడ్డి. ప్రముఖ తెలుగు టీవీలో యాంకర్‌గా పని చేస్తో

'నా బ్రెయిన్ నా శత్రువు - నా ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదు' అంటూ సూసైడ్ నోట్ రాసిపెట్టి ఓ బుల్లితెర యాంకర్ బలవన్మరణానికి పాల్పడింది. ఆ యాంకర్ పేరు రాధికా రెడ్డి. ప్రముఖ తెలుగు టీవీలో యాంకర్‌గా పని చేస్తోంది. ఆదివారం రాత్రి 10 గంటలకు విధులు ముగించుకుని ఇంటికి చేరిన రాధిక.. తాను నివాసం ఉంటున్న హైదరాబాద్ మూసాపేట్ గూడ్స్ షెడ్ రోడ్‌లోని సువీల అపార్ట్‌మెంట్ ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తలకు తీవ్రగాయమవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. తన చావుకు ఎవరూ కారణం కాదని.. అంటూ సూసైడ్ నోట్‌లో రాసిపెట్టింది.
 
అయితే, ఈమె ఆత్మహత్యకు మానసిక ఒత్తిడే కారణమని తెలుస్తోంది. ముఖ్యంగా, ఆర్నెల్ల క్రితం భర్తతో విడాకులు తీసుకుని దూరంగా ఉండడం.. ఒక్కగానొక్క కుమారుడు మానసికంగా ఎదగకపోవడం.. ఆమెను తీవ్రంగా కలచివేశాయి.. ఏళ్లతరబడి మనోవేదన అనుభవించిన ఆమె.. ఆదివారం తనువు చాలించింది. 
 
మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామానికి చెందిన వెంకనగారి రాధికా రెడ్డి (36) ఓ తెలుగు వార్తా చానెల్‌లో యాంకర్‌గా పనిచేస్తోంది. 15 ఏళ్ల కిందట వివాహమైంది. ఆర్నెల్లుగా భర్తకు దూరంగా ఉంటోంది. రాధిక ఆరు నెలలుగా కుమారుడు భానుతేజా రెడ్డి(14)తో కలిసి ఒంటరిగా నివశిస్తోంది. అయితే, కుమారుడు మానసికంగా ఎదగకపోవడం, భర్తతో విడిపోవడంతో ఆమె తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటూ వచ్చింది.
 
దీంతో ఆదివారం ఎప్పటిలాగానే విధులకు వెళ్లిన ఆమె రాత్రి 10 గంటలకు ఇంటికి వచ్చిన ఆమె నేరుగా ఐదో అంతస్తుకు వెళ్లింది. హ్యాండ్‌ బ్యాగ్‌ పక్కన పడేసి కిందకు దూకేసింది. తలకు తీవ్ర గాయమవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. దీన్ని గమనించిన ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగ, రాధిక హ్యాండ్‌ బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఆమె పెన్సిల్‌తో రాసిన సూసైడ్‌ నోట్‌ దొరికింది.