మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr

బెంగాలీ బుల్లితెర సీరియల్ నటి సూసైడ్

బెంగాలీ టీవీ సీరియల్ నటి మౌమిత సాహా ఆత్మహత్యకు పాల్పడింది. తన నివాసంలో ఉరివేసుకుంది. ఆమె వయసు 23 ఏళ్లు. ఈ ఘటన సంచలనం రేపుతోంది.

బెంగాలీ టీవీ సీరియల్ నటి మౌమిత సాహా ఆత్మహత్యకు పాల్పడింది. తన నివాసంలో ఉరివేసుకుంది. ఆమె వయసు 23 ఏళ్లు. ఈ ఘటన సంచలనం రేపుతోంది. దక్షిణ కోల్‌కతాలోని రీజెంట్ పార్క్ ఏరియాలో ఉన్న తన నివాసంలో ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. 
 
శనివారం మధ్యాహ్నం నుంచి డోన్ ఓపెన్ చేయకపోవడంతో... ఇంటి ఓనర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో, అక్కడకు చేరుకున్న పోలీసులు, తలుపులు పగలగొట్టి లోపలకు వెళ్లారు. ఇంటిలోకి వెళ్లిన పోలీసులకు సీలింగ్‌కు వేలాడుతున్న మౌమిత మృతదేహం కనిపించింది. 
 
కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇంట్లో గాలించగా, ఆమె రాసిన సూసైడ్ నోట్‌ లభించింది. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. డిప్రెషన్ వల్లే ఆమె సూసైడ్ చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు.