మీ లైక్స్ కోసం ఇలా గాలి వార్తలు ప్రచారా చేస్తారా?: హీరో శ్రీకాంత్ ఆగ్రహం
ఇటీవల సోషల్ మీడియాలో కొంతమంది చేస్తున్న అకృత్యాలను చూస్తుంటే మీడియా పైనే విసుగుపుట్టేలా అనిపించడం ఖాయం. వారి వీడియోలకు లైకులు రావడం కోసం, వ్యూస్ పెరగడం కోసం కొన్ని సంస్థలు చేస్తున్న తీరు ఆడియెన్స్‌నే కాదు సెలెబ్రెటీలను సైతం చిరాకు తెప్పిస్తోంది. గాసి
ఇటీవల సోషల్ మీడియాలో కొంతమంది చేస్తున్న అకృత్యాలను చూస్తుంటే మీడియా పైనే విసుగుపుట్టేలా అనిపించడం ఖాయం. వారి వీడియోలకు లైకులు రావడం కోసం, వ్యూస్ పెరగడం కోసం కొన్ని సంస్థలు చేస్తున్న తీరు ఆడియెన్స్‌నే కాదు సెలెబ్రెటీలను సైతం చిరాకు తెప్పిస్తోంది. గాసిప్స్ అంటే కొంత తెలిసి మరికొంత తెలియని విషయాన్ని ఆరోగ్యకరంగా చెప్పడమో.. లేక చూపించడమో జరగాలి కానీ విరక్తి పుట్టించేలా ఉండటమే కాకుండా అవతలి వారి మనోభావాలను దెబ్బతీసేలా ఉండకూడదు అని కొందరి భావన.
ఇక ఇదంతా దేనికి అంటే... ప్రస్తుతం కాలంలో కొంతమంది సోషల్ మీడియాలో కల్పించి వ్రాస్తున్న న్యూస్‌లకు, క్రియేట్ చేస్తున్న వీడియోలకు చాలామంది సెలెబ్రటీల మనోభావాలను దెబ్బతీశారు. బ్రతికి ఉన్నవారిని చంపేస్తున్నారు. ఆరోగ్యాంగా ఉన్నవారిపై ప్రమాదం జరిగి విషమ పరిస్థితిలో ఉన్నారనే వార్తలను సృష్టించేస్తున్నారు. ఈ అసత్య వార్తలను ఖండించలేక కొంతమంది సెలెబ్రెటీలు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.
తాజాగా హీరో శ్రీకాంత్‌కు ఈరోజు యాక్సిడెంట్ అయింది అంటూ ఓ వెబ్‌సైట్ యూ ట్యూబ్ ఛానల్లో పెట్టేసింది. ఈ వీడియో న్యూస్‌ను తీవ్ర స్థాయిలో ప్రచారం చేశారు. దీంతో హీరో శ్రీకాంత్ ఈ వార్తను ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూ ట్యూబ్ ఛానల్ వాళ్ళ లైక్స్ కోసం, సబ్‌స్క్రైబ్స్ కోసం ఇలా దిగజారుతారా అంటూ మండిపడ్డాడు. నేను బెంగళూరు షూటింగ్‌లో ఉండగా నిన్న ఉదయం నుంచి మీకు యాక్సిడెంట్ అయ్యిందట కదా ఎలా ఉంది అంటూ ఫోన్ కాల్స్ రావడం మొదలయ్యాయి.
హైదరాబాద్‌లో ఉన్న నా కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయం తెలిసి కంగారుపడి ఫోన్స్ చేశారు. అలాగే అభిమానుల నుంచి కూడా ఆందోళనకరమైన ఫోన్స్ వస్తున్నాయి. ఇలా అసత్య వార్తలతో వీడియోలు చేసి వాయిస్ ఓవర్‌తో మీ లైక్స్ కోసం, రేటింగ్స్ కోసం వెబ్సైట్‌లో వార్తలు పెట్టడం చాలా తప్పు. ఇలాంటి వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇకముందు ఎవరూ ఇలాంటి గాలి వార్తలు రాయొద్దు.
ఎవరో ఓ వ్యక్తి తప్పు చేస్తే దాన్ని తీసుకొని మరికొన్ని వెబ్సైట్, యూట్యూబ్ చానెల్స్ పేపర్లలో వేస్తున్నారు.. ఇది పెద్ద తప్పు. ఈ విషయంపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా సీరియస్‌గా తీసుకుంటుంది.. అలాగే ఈ అసత్య ప్రచారం జరిపిన వారిపై సైబర్ క్రైం ఎస్. పి. రామ్మోహన్ రావు గారికి 'మా' ద్వారా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగిందని తెలియచేసారు హీరో శ్రీకాంత్.