మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 13 మార్చి 2018 (10:53 IST)

నిత్యం శీలాన్ని శంకిస్తూ సూటిపోటి మాటలు.. తనువు చాలించిన విప్రో ఉద్యోగిని.. ఎక్కడ?

కట్టుకున్న భర్త నిత్యం శీలాన్నిశంకిస్తూ సూటిపోటి మాటలతో మానసికక్షోభకు గురిచేస్తుంటడంతో అతనితో కలిసి జీవించలోక ఓ విప్రో ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన బెంగుళూరులోని భువనేశ్వర్ నగర్‌లో జరి

కట్టుకున్న భర్త నిత్యం శీలాన్నిశంకిస్తూ సూటిపోటి మాటలతో మానసికక్షోభకు గురిచేస్తుంటడంతో అతనితో కలిసి జీవించలోక ఓ విప్రో ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన బెంగుళూరులోని భువనేశ్వర్ నగర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
భువనేశ్వరి నగర్‌లో విజయ్ కిరణ్, తులసి అనే దంపతులు నివసిస్తున్నారు. వీరిలో తులసి విప్రో కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. నిత్యమూ భార్య ప్రవర్తనను అనుమానించే విజయ్, ఆమెను వేధించసాగాడు. గతంలో పలుమార్లు వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఆదివారం కూడా తులసి శీలాన్ని శంకించేలా మాట్లాడటంతో ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. 
 
భర్త ప్రవర్తనతో తీవ్ర మనస్తాపం చెందిన ఆమె, అదే రోజు రాత్రి న గదిలోకి వెళ్లి, ఫ్యాన్ కు ఉరేసుకుంది. ఎంత సేపు పిలిచినా పలక్కపోవడంతో ఆమె భర్త విజయ్, తలుపులు బద్దలు కొట్టి ఆమెను కిందకు దించి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి భర్తను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.