శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: బుధవారం, 7 మార్చి 2018 (19:18 IST)

భర్త, అత్తమామల ఎదుటే ఉరి వేసుకున్న భార్య.. ఎక్కడో తెలుసా?

పెళ్ళి చేసుకున్న తరువాత అత్తింటికి వెళితే ఆమెను తన కన్నకూతురితో సమానంగా చూసుకోవాలి అత్తమామలు. అయితే అలాంటి పరిస్థితి ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. వరకట్న వేధింపులు ప్రతిచోటా కనిపిస్తూనే ఉన్నాయి. వరకట్నం కారణంగా ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

పెళ్ళి చేసుకున్న తరువాత అత్తింటికి వెళితే ఆమెను తన కన్నకూతురితో సమానంగా చూసుకోవాలి అత్తమామలు. అయితే అలాంటి పరిస్థితి ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. వరకట్న వేధింపులు ప్రతిచోటా కనిపిస్తూనే ఉన్నాయి. వరకట్నం కారణంగా ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొంతమంది వివాహిత మహిళలు గొడవ జరిగిన తరువాత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకునో.. లేక నిద్రమాత్రలు మింగో ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూసే లోపే చనిపోయి ఉంటారు. కానీ తిరుపతిలో జరిగిన సంఘటన మాత్రం అందుకు భిన్నం. 
 
వరకట్నవేధింపులతో  గొడవ జరుగుతుండగానే భర్త, అత్తమామల ఎదుటే తలుపులు తెరుచుకుని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నదో వివాహిత. ముగ్గురూ ఆమె ఉరి వేసుకుంటూ వుంటే చూస్తున్నారు కానీ ఎవరూ ఆపలేదు. చనిపోయిన తరువాత ఆమెను కిందకు దించి ఆసుపత్రికి తరలించారు. తిరుపతి పెద్దకాపువీధిలో జరిగిన సంఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. 
 
సంవత్సరం క్రితం తిరుపతి రూరల్ కాయంపేటకు చెందిన సుమలతతో తిరుపతి పెద్దకాపువీధికి చెందిన నెహ్రూతో వివాహం చేశారు. వివాహమైనప్పటి నుంచి వరకట్న వేధింపులు సుమలతకు మొదలయ్యాయి. ప్రస్తుతం సుమలత 8 నెలల గర్భిణి. వేధింపులు ఒక్కసారిగా ఎక్కువ కావడంతో భర్త, అత్తమామలతో గొడవ పడిన సుమలత తన బెడ్‌రూంలోకి వెళ్ళి అందరూ చూస్తుండగానే ఉరివేసుకుంది. 
 
సుమలత ఉరివేసుకుంటున్నా కనీసం ఆపలేదు కుటుంబ సభ్యులు. దీంతో ఆమె మృతి చెందింది. ఉరి వేసుకుని చనిపోయిన తరువాత కిందకు దింపి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సుమలత మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం భర్త నెహ్రూ, అత్త, మామలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.