శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 18 ఫిబ్రవరి 2018 (14:15 IST)

బాయ్‌ఫ్రెండ్‌కు వీడియో కాల్ చేసి ఉరేసుకున్న బీటెక్ విద్యార్థిని

ప్రకాశం జిల్లాలో విషాదం జరిగింది. బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తన బాయ్ ఫ్రెండ్‌కు వీడియో కాల్ చేసి, ఎంబీఏ చదువుతున్న విద్యార్థిని హనీషా చౌదరి కాలేజీ హాస్టల్‌లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని మరణించి

ప్రకాశం జిల్లాలో విషాదం జరిగింది. బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తన బాయ్ ఫ్రెండ్‌కు వీడియో కాల్ చేసి, ఎంబీఏ చదువుతున్న విద్యార్థిని హనీషా చౌదరి కాలేజీ హాస్టల్‌లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని మరణించిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, అనంతపురం జిల్లాకు చెందిన హనీషా అనే యువతి కొంపల్లిలోని శివశివానీ కాలేజీలో ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతోంది. ఈమె దక్షిణ్ పటేల్ అనే యువకుడిని ఆమె ప్రేమించింది. 
 
అయితే, వారిమధ్య ఏం జరిగిందో ఏమో తెలియదుకానీ, ప్రియుడికి వీడియో కాల్ చేసింది. ప్రియుడు వీడియో చూస్తుండగానే ఆ యువతి ఉరేసుకుంది. వెంటనే అతను హాస్టల్‌కు చేరుకుని, విషయం చెప్పి తలుపులను బద్దలు కొట్టి చూడగా, ఆమె అపస్మారక స్థితిలో కనిపించింది. 
 
ఆమె ఫ్రెండ్స్ సాయంతో సిగ్మా ఆసుపత్రికి తరలిస్తుండగా, ఈలోగానే ప్రాణాలు కోల్పోయింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు, అనంతపురంలో ఉన్న తల్లిదండ్రులకు సమాచారం అందించారు.