బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 18 ఫిబ్రవరి 2018 (10:38 IST)

పీఎన్‌బీ స్కామ్‌లో ఆర్బీఐ అధికారుల పాత్ర?

దేశ బ్యాంకింగ్ రంగాన్ని ఓ కుదుపు కుదిపిన పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్‌లో భారత రిజర్వు బ్యాంకు అధికారులతో పాటు.. పీఎన్‌బీ బ్యాంకు సీనియర్ అధికారుల పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది.

దేశ బ్యాంకింగ్ రంగాన్ని ఓ కుదుపు కుదిపిన పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్‌లో భారత రిజర్వు బ్యాంకు అధికారులతో పాటు.. పీఎన్‌బీ బ్యాంకు సీనియర్ అధికారుల పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పీఎన్బీ బ్యాంకు మేనేజర్ గోకుల్‌నాథ్ శెట్టి సహకరించడం వల్లే ఈ స్కామ్ జరిగినట్టు సీబీఐ అధికారులు ప్రాథమిక నిర్ధారించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఈ స్కామ్‌లో పీఎన్బీ ఉన్నతాధికారులు, ఆర్బీఐ అధికారుల పాత్ర ఉందన్న అనుమానాలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా పీఎన్బీ ఛైర్మన్ సహా‌, ఆర్బీఐ ఉన్నతాధికారులను సీబీఐ దృష్టి పెట్టింది. 
 
ముఖ్యంగా, రూ.వేల కోట్ల అవినీతిని ఆయా బ్యాంకు శాఖల ఇంటర్నెల్‌ ఆడిటింగ్‌ సందర్భంగా ఆర్బీఐ ఎందుకు కనిపెట్టలేదనే విషయాన్ని సీబీఐ వర్గాలు ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఇకపోతే, బ్యాంకు డిప్యూటీ మేనేజర్‌గా పని చేసిన గోకుల్‌నాథ్‌ శెట్టి ఏడేళ్లపాటు ఒకే స్థానంలో కదలకుండా ఉండి.. నీరవ్‌ మోదీకి, గీతాంజలి జెమ్స్‌కు బ్యాంకు తరపున లెటర్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్‌లను (ఎల్ఓయూ) జారీ చేశారు. ఈ ఏడేళ్లలో ఒక్కసారి కూడా విషయం బయటకు రాలేదు. ఎవరికంటా పడలేదు. పోనీ ఈ ఏడేళ్లలో ఆయన కొన్నిరోజులు సెలవు పెట్టిన దాఖలాలు కూడా లేవు. ఇపుడు దీనిపైనే సీబీఐ అదికారు కూపీ లాగుతున్నారు. ప్రస్తుతం గోకుల్‌నాథ్ శెట్టిని అరెస్టు చేశారు.