శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (14:08 IST)

సైకోశంకర్ కథ ముగిసింది... 30 రేప్‌లు... 15 మర్డర్లు.. ఇవీ నేరాలు

సైకోశంకర్ కథ ముగిసింది. దేశంలోనే అత్యంత కరుడుగట్టిన నేరగాడిగా పేరుగాంచిన సైకోశంకర్(41) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెంగుళూరు నగర శివారు ప్రాంతాల్లో ఉన్న పరప్పణ అగ్రహార జైలులో ఖైదీగా ఉంటూ ఆత్మహత్య చేసుకున్

సైకోశంకర్ కథ ముగిసింది. దేశంలోనే అత్యంత కరుడుగట్టిన నేరగాడిగా పేరుగాంచిన సైకోశంకర్(41) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెంగుళూరు నగర శివారు ప్రాంతాల్లో ఉన్న పరప్పణ అగ్రహార జైలులో ఖైదీగా ఉంటూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేరగాడు అటు కర్ణాటక, ఇటు తమిళనాడు రాష్ట్రాల పరిధిలో 30 మంది మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డాడు. అలాగే, 15 మందిని దారుణంగా హతమార్చాడు. 
 
బెంగళూరు జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఇతడు గతంలో రెండుసార్లు తప్పించుకుపోయాడు. సినిమాల్లో సీన్లను తలపిస్తూ వెదురు బొంగు, బెడ్ షీటు సాయంతో ఎత్తైన గోడల పైనుంచి దూకి పారిపోయాడు. ఆ తర్వాత పోలీసులు అతడ్ని అరెస్టు చేసి జైలుకు తరలించారు. 
 
ఈనేపథ్యంలో జైలులో బ్లేడుతో గొంతు కోసుకుని రక్తపు మడుగులో పడివుండగా తోటి ఖైదీలు చూసి అధికారులకు సమాచారం అందించారు. శంకర్‌ను విక్టోరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. 
 
సైకో శంకర్ మరణంపై విచారణకు అధికారులు ఆదేశించారు. బార్బర్ నుంచి బ్లేడ్ ముక్కును కొట్టేసి శంకర్ తన షర్ట్ లో కనిపించకుండా దాచి ఉండొచ్చని అధికారుల వాదన. ఈ సైకో శంకర్ స్వగ్రామం తమిళనాడులోని సేలం జిల్లా ఎడప్పాడికి సమీపంలో ఉన్న కన్నియంపట్టి అనే గ్రామం.