మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 6 డిశెంబరు 2017 (10:18 IST)

టీవీ చూసేందుకు వచ్చిన 8 యేళ్ల బాలికపై అత్యాచారం

రేపిస్టులను ఉరితీసేందుకు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఓ కఠిన చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ బిల్లుకు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

రేపిస్టులను ఉరితీసేందుకు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఓ కఠిన చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ బిల్లుకు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అంటే.. 12 యేళ్లలోపు బాలికలపై అత్యాచారం పాల్పడే కామాంధులను ఉరితీసేలా ఆ బిల్లును తయారు చేశారు. ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపిన రోజే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. 
 
దేపలూర్ తహసీల్ పరిధిలోని చందర్ గ్రామంలో సందీప్ చగన్ లాల్ (19) అనే యువకుడు టీవీ చూసేందుకు తమ ఇంటికి వచ్చిన 8 ఏళ్ల బాలికపై అఘాయిత్యం చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. మొత్తంమీద బాలికలపై అత్యాచారం చేస్తే ఉరిశిక్ష విధించాలని అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించిన రోజే ఈ ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.