శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 6 డిశెంబరు 2017 (09:51 IST)

ప్రేమించలేదనీ కాల్‌గర్ల్‌ అంటూ పోస్టులు.. టెక్కీ అరెస్టు

తనను ప్రేమించని కారణంగా ఓ యువతిని కాల్‌గర్ల్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కేసులో హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

తనను ప్రేమించని కారణంగా ఓ యువతిని కాల్‌గర్ల్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కేసులో హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కర్నూలుకు చెందిన సందీప్ కుమార్ గుప్తా అనే టెక్కీ చెన్నైలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈయన ఓ యువతిని ప్రేమించగా, ఆ యువతి ప్రేమను నిరాకరించింది. దీంతో ఆ యువతిపై ప్రతీకారం తీర్చుకునేందుకు తన పేరున నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేసి అసభ్యకర సందేశాలు పోస్టు చేయసాగాడు. అంతటితో ఆగకుండా తనతో పాటు కుటుంబసభ్యుల సెల్‌ఫోన్ నెంబర్లను సోషల్ మీడియాలో (లోకోంటో, బ్లాగ్‌ స్పాట్‌)లో కాల్‌గర్ల్‌గా పోస్టు చేసి వేధించాడు. 
 
ఈ విషయాన్ని పసిగట్టిన బాధిత యువతి సైబర్‌ పోలీసులకు ఫిర్యాదుచేసింది. కేసు నమోదుచేసిన పోలీసులు కాల్‌డేటా, ఐపీ వివరాల ఆధారంగా మంగళవారం ఉదయం నిందితుడు సందీప్‌ను అరెస్టు చేసి మొబైల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని మియాపూర్‌లోని కూకట్‌పల్లి 16వ కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు.