బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 9 మార్చి 2018 (15:39 IST)

కంబైన్డ్ స్టడీ కోసం మేడపైకెళ్లి కలిసి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థినులు

హైదరాబాద్ నగరంలో విషాదం జరిగింది. కంబైన్డ్ స్టడీ కోసం మిద్దెపైకి వెళ్లిన ఇద్దరు విద్యార్థినులు అక్కడ నుంచి కలిసి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఎల్బీనగర్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఈ వివరాలను పరి

హైదరాబాద్ నగరంలో విషాదం జరిగింది. కంబైన్డ్ స్టడీ కోసం మిద్దెపైకి వెళ్లిన ఇద్దరు విద్యార్థినులు అక్కడ నుంచి కలిసి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఎల్బీనగర్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్, ఎల్బీ నగర్‌లోని టీఎన్‌ఆర్‌ వైష్ణవి శిఖర అపార్టుమెంట్‌లోని 8వ అంతస్తులో నివసించే కాంతిపటేల్‌ వ్యాపారి. ఆయన చిన్నకుమార్తె భార్గవి(15) హస్తినాపురంలోని అక్షర ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో పదోతరగతి చదువుతోంది. సహ విద్యార్థిని శ్రావణి(15) స్నేహం ఉంది. శ్రావణి తండ్రి కె.నాగేంద్ర ఆర్‌సీఐలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాడు. 
 
ఇటీవలే పదోతరగతి పరీక్షలు ప్రారంభంకావడంతో ఇద్దరూ ఎల్బీనగర్‌లోని భార్గవి ఇంట్లోనే కలిసి ప్రిపేర్ అవుతున్నారు. తొలి పరీక్ష అనంతరం శ్రావణి అనారోగ్యానికి గురైంది. గత మూడు రోజలుగా బాధపడుతూ వచ్చిన శ్రావణి గురువారం సాయంత్రం భార్గవి ఇంటికి వచ్చింది. అనంతరం రెండు గంటల తర్వాత సాయంత్రం 6.30 గంటల సమయంలో ఇరువురూ ఆ అపార్టుమెంటులోని 8వ అంతస్తులోని ఇంటి బాల్కనీలోంచి అమాంతం కిందికి దూకేశారు. 
 
వారికిద్దరికీ బలమైన గాయాలు తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత కేసు విచారణలో భాగంగా, ఇంట్లో గాలించారు. అపుడు ఓ చెత్తబుట్టలో శ్రావణి రాసినట్లు ఉన్న సూసైడ్‌నోట్‌ దొరికింది. అందులో 'డియర్‌ మా.. పా.. సారీ..' అంటూ అమ్మానాన్నలకు సారీ చెబుతూ.. 'ఐ మిస్‌యూ తేజూ..' అంటూ అన్నయ్యను సంబోధిస్తూ లేఖ రాసినట్లుంది.