1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Medchal : Harassment to Girl

బాలికకు చిత్ర హింసలు... విముక్తి కల్పించిన ఐసీడీఎస్

Medchal
ఆభం శుభం తెలియని చిన్నారిని తల్లిదండ్రులు సాకలేక ఒ కుటుంబానికి అప్పగించగా ఇంటి యజమానులు బాలికకు నరకయాతన చూపిన హృదయ విదారక సంఘటన మేడ్చల్ పట్టణంలో వెలుగులోకి వచ్చింది. 
 
పోలీసుల వివరాల ప్రకారం.. పట్టణంలోని కేఎల్ఆర్ వెంచర్‌లోని రాజరాజేశ్వరి అపార్టుమెంట్లో ఓ ఇంట్లో బాలికను తల్లిదండ్రులు రూ.10 వేలకు అప్పగించారు. ఆ ఇంటి యజమానులు చిన్నారి అని కూడా కనికరం చూపకుండా తీవ్రంగా గాయపరిచి వెట్టి చాకిరి చేయిస్తు హింసించారు. అది గమనించిన స్థానికులు ఐసీడీఎస్, బాలల హక్కుల సంఘం నేతలకు ఫిర్యాదు చేశారు. 
 
దీంతో ఆ ఇంటికి ఐసీడీఎస్ అధికారులు, రాష్ట్ర బాలల హక్కుల సంఘం సభ్యురాలు రాగజ్యోతి ఆ ఇంటికి వెళ్లి బాలికకు విముక్తి కల్పించారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
తర్వాతి కథనం
వైద్యుల నిర్లక్ష్యం... ప్రాణాలు కోల్పోయిన డ్రైవరు