తెలంగాణలో కరోనా వైరస్ ఉగ్రరూపం.. 209 కేసులు.. 9మంది మృతి

corona virus
corona virus
సెల్వి| Last Updated: శుక్రవారం, 12 జూన్ 2020 (10:00 IST)
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. వాతావరణం కాస్త చల్లబడటంతో కరోనా రెచ్చిపోతుంది. ఫలితంగా శుక్రవారం 209 పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

వాటిలో జీహెచ్ఎంసీ పరిధిలో 175 కేసులు నమోదవగా, మేడ్చల్‌లో 10, రంగారెడ్డిలో 7, వరంగల్ అర్బన్‌లో 2, మహబూబ్ నగర్‌లో 3, ఆసిఫాబాద్‌లో 2, సిద్దిపేట్‌లో 2, కరీంనగర్ 3, ములుగు 1, కామారెడ్డి 1, వరంగల్ రూరల్ 1, సిరిసిల్లా1, వలస కార్మికులలో 1గా కేసులు నమోదయ్యాయి.

అంతేగాకుండా కరోనాతో తొమ్మిది మంది మృతి చెందగా, మృతుల సంఖ్య 165కు చేరుకుంది. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 4,320కు చేరుకుంది. ఆసుపత్రి నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,993కు చేరింది. 2,162 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో అయితే పాజిటివ్ నిర్ధారణ కేసులు చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుతోంది. ఎప్పుడు ఎవరి వల్ల కరోనా సోకుతుందోనన్న భయం ప్రజల్లో కలుగుతోంది. తెలంగాణ జిల్లాల్లో ఈమధ్య వరకూ కరోనా కేసులు అంతగా నమోదు కాలేదు. లాక్ డౌన్ సడలింపులు అనంతరం కేసుల తీవ్రత బాగా పెరగడంతో ఆందోళన ఎక్కువ అవుతోంది.దీనిపై మరింత చదవండి :