శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 జూన్ 2020 (09:53 IST)

రైతు బంధుకి దరఖాస్తు చేసుకోలేదా? ఇంకో ఛాన్స్ వచ్చేసింది..?

తెలంగాణలో రైతుబంధు పథకం ప్రయోజనాలు అందుకోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎంతో మందికి అండగా నిలుస్తున్న రైతుబంధు పథకం కోసం ఇప్పటి వరకు కొంత మంది రైతులు దరఖాస్తు చేసుకోలేదు. అలాంటి రైతులు దరఖాస్తు చేసుకోడానికి వ్యవసాయ శాఖ మరో అవకాశం కల్పించింది. 
 
ఈ ఏడాదే జనవరి నెలలో కొత్తగా పాస్ పుస్తకాలు తీసుకున్న రైతులు, ఇంతకు ముందే పాస్ పుస్తకాల ఉండికూడా దరఖాస్తు చేసుకోనివారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ నెల 13వ తేదీ లోగా రైతుబంధుకోసం రైతులు దరఖాస్తుచేసుకునే అవకాశం కల్పించింది. 
 
రైతుల అర్హతల ఆధారంగా ఈ పథకం ద్వారా మీ చెక్కుల రూపంలో సాయం చేస్తుంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 58.34 లక్షల మంది రైతులకు పెట్టుబడిసాయం అందిస్తుంది. ఎకరానికి రూ.4 వేల చొప్పున సాగుకు పెట్టుబడి సాయం చేస్తోంది. ఖరీఫ్, రబీ ఈ రెండు సీజన్లకుగాను ఎకరానికి రూ. 5000 చొప్పున రూ. 10,000లను రైతుకు చెక్కుల రూపంలో ఇవ్వనున్నారు.
 
రైతు బంధు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.. దరఖాస్తు ఫారంతో పాటు భూమి పట్టా పాస్ పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్(సేవింగ్స్ అకౌంట్), ఎమ్మార్వో డిజిటల్ సంతకం చేసిన పేపర్ జోడించాలి. వెంటనే దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ కోరింది.