సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 జూన్ 2020 (11:30 IST)

వాలంటీర్ కాదు.. కామపిశాచి.. నిద్రిస్తున్న మహిళపై చేయివేసి..

కరోనా లాంటి ప్రాణాంతక వ్యాధులు వస్తున్నా.. కామాంధుల్లో మాత్రం మార్పు రావట్లేదు. తాజాగా నెల్లూరు జిల్లాలో ఓ గ్రామ వాలంటీర్ మహిళ పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. మహిళ పట్ల నీచంగా ప్రవర్తించాడు. నిద్రిస్తున్న మహిళపై చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. భర్త మేల్కొని పట్టుకునేలోపే పరారయ్యాడు. ఈ ఘటన వాకాడు మండలం నల్లగామాల గ్రామంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. రాత్రి ఇంటి వద్ద నిద్రిస్తున్న తన భార్యపై గ్రామ వలంటీర్ వెంకటేశ్ చేయి వేశాడంటూ పోలీస్‌స్టేషన్‌లో శ్రీనివాసులు అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. వాలంటీర్‌ను పట్టుకునేలోపే తప్పించుకుని పారిపోయాడని ఆరోపించాడు. వెంకటేశ్‌ను పట్టుకుని నిలదీస్తే.. తాను రాలేదని బుకాయిస్తున్నాడని ఫిర్యాదులో శ్రీనివాసులు చెప్తున్నాడు.