గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 మే 2020 (12:00 IST)

ఆంధ్రలో మరో 25 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 25 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మొత్తం 9880 శాంపిళ్లను పరిశీలించగా, మొత్తం 25 మందికి ఈ కరోనా కేసులు నమోదైనట్టు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఈ కొత్త కేసులతో కలుపుకుని మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,230గా ఉందని తెలిపింది. 
 
ప్రస్తుతం ఆసుపత్రుల్లో 747 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,433 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో కరోనాతో 24 గంటల్లో మరొకరు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు ఏపీలో మృతి చెందిన వారి సంఖ్య 50కి చేరింది.
 
రాష్ట్రంలో గత 24 గంటల్లో చిత్తూరులో 4, గుంటూరులో 4, కర్నూలులో 3, నెల్లూరులో 1, ప్రకాశంలో 3, శ్రీకాకుళంలో 7, విశాఖపట్నంలో 3 కేసులు నమోదయ్యాయని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. 
 
మరోవైపు, జిల్లాల వారీగా మొత్తం నమోదైన కేసుల వివరాలను పరిశీలిస్తే, అనంతపూర్ 122, చిత్తూరు 177, ఈస్ట్ గోదావరి 52, గుంటూరు 417, కడప 102, కృష్ణ 367, కర్నూలు 611, నెల్లూరు 150, ప్రకాశం 66, శ్రీకాకుళం 14, విశాఖపట్టణం 75, విజయనగరం 7, వెస్ట్ గోదావరి 70 చొప్పున మొత్తం కేసుల సంఖ్య 2230కు చేరాయి.