ఇళ్లు కట్టడం, పెళ్లి చేయడం ఇష్టం లేక కన్నకూతురిపై రేప్ చేశాడంట.. మౌనిక కేసు నిందితుడి కొత్త కథ!
పేగు పంచుకుని పుట్టిన కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కామంతో కాటేశాడు. కూతురు అనే విచక్షను మరిచి... కామంతో చరిచాడు. వావి వరుస మరిచి మృగం కంటే హీనంగా కూతురి జీవితాన్నేపాడుచేశాడు. ఈ ఘటన కరీంన
పేగు పంచుకుని పుట్టిన కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కామంతో కాటేశాడు. కూతురు అనే విచక్షను మరిచి... కామంతో చరిచాడు. వావి వరుస మరిచి మృగం కంటే హీనంగా కూతురి జీవితాన్నేపాడుచేశాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా మేడిపల్లి మండలం దేశాయిపేటలో దారుణం చోటుచేసుకుంది. రెండు నెలల క్రితం పెళ్లయిన ఓ వివాహితను అత్యాచారయత్నం చేసి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సంచలనం సృష్టించిన మౌనిక హత్యకేసును పోలీసులు అన్ని కోణాల్లో విచారించారు. సోమవారం కోరుట్లలో సీఐ రాజశేఖర్‌రాజు వివరాలను వెల్లడించారు.
దేశాయిపేటకు చెందిన బూమల్ల నడ్పి మల్లయ్య తన కూతురు మౌనిక (19)ను మోత్కురావుపేటకు చెందిన మహేష్‌తో ఏప్రిల్‌లో వివాహం జరిపించాడు. పెళ్లైనా తర్వాత ఆషాఢ మాసం కోసం శనివారం రాత్రి ఆమె భర్త దగ్గర నుంచి కుమార్తెను ఇంటికి తీసుకెళ్తూ మార్గమధ్యంలో అత్యాచారానికి యత్నించాడు. మౌనిక అడ్డుకుంటూ కాపాడండీ.. కాపాడండీ అని కేకలు పెట్టడంతో అతికిరాతరంగా చీర కొంగుతో ఉరేసి హతమార్చాడు. అయితే ఏమీ తెలీనట్టుగా కుమార్తెను ఇద్దరు వ్యక్తులు అపహరించారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆదివారం ఉదయం నుంచి పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టగా మధ్యాహ్నం దేశాయిపేట శివారులో మౌనిక మృతదేహం లభించింది.
అసలు మల్లయ్య కూతురిని ఎందుకు చంపాల్సివచ్చిందన్న వివరాల్ని పోలీసుల ముందు వివరించాడు. మల్లయ్య దుబాయ్‌కి వెళ్లి పంపిన డబ్బుతో భార్య రూ.4 లక్షలతో ఇల్లు కట్టింది. అలాగే రూ.5 లక్షలు కట్నంతో మౌనిక(19)కు పెళ్లి చేసింది. రెండు నెలల కిందటే పెండ్లి కోసం మల్లయ్య తన స్వస్థలానికి వచ్చాడు. తనకు ఇష్టం లేకున్నా ఇల్లు నిర్మించడం, పెండ్లిచేయడంతో పగ పెంచుకున్నాడు. గతంలో ఏనాడు తండ్రిగా చూడని కూతురిపైనా కక్షతో... ఆషాఢమాసం నేపథ్యంలో శనివారం మోత్కురావుపేటకు నుంచి బైక్‌పై మౌనికను తీసుకొస్తూ పొలం వద్ద పని ఉందని తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించగా ఆమె ప్రతిఘటించింది. బతికుంటే బయటకు చెప్తుతుందనికొంగుతో ఉరేసి హతమార్చాడు. ముసుగేసుకున్న ఇద్దరు దుండగులు కత్తులతో బెదిరించి మౌనికను అపహరించాడని కట్టుకథ అల్లాడు. పోలీసులు విచారించగా మల్లయ్య నేరాన్ని అంగీకరించాడు.

