మల్టీ నేషనల్‌లో ఆ ఇద్దరికీ ఉద్యోగం.. ప్రేమించారు.. సహజీవనం చేశారు... కానీ పెళ్లికి మాత్రం?!
బెంగళూరులోని ఓ మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కానీ చిన్నబుద్ధితో ప్రవర్తించాడు. పెళ్లికి నో చెప్పిందని.. ఏకాతంగా ఉన్నప్పుడు తీసిన ఫోటోలను స్నేహితులకు, బంధువులకు పంపాడు. తామిద్దరం పెళ్ళి చేసుకో
బెంగళూరులోని ఓ మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కానీ చిన్నబుద్ధితో ప్రవర్తించాడు. పెళ్లికి నో చెప్పిందని.. ఏకాతంగా ఉన్నప్పుడు తీసిన ఫోటోలను స్నేహితులకు, బంధువులకు పంపాడు. తామిద్దరం పెళ్ళి చేసుకోబోతున్నట్లు సందేశం కూడా పెంచాడు. తన వ్యక్తిగత ఖాతాలతో అతడు బ్లాక్ మెయిల్‌కు పాల్పడటంతో బాధితురాలు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన ఇన్‌స్పెక్టర్ రియాజుద్దీన్ కేసు నమోదుచేసి నిందితుడి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
వివరాల్లోకి వెళితే.. మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేస్తున్న పనిచేస్తున్న యువతీ, యువకుడి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమ, సహజీవనం వరకు వెళ్లింది. అయితే కొన్నాళ్లకు ఆ యువకుడి ప్రవర్తన ఆ యువతికి నచ్చకపోవడంతో.. అతడిని పెళ్లి చేసుకోనని స్పష్టం చేసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన యువకుడు ఫేస్ బుక్, మెయిల్ ఐడీ పాస్ వర్డ్‌లు తెలియడంతో.. ఇద్దరూ ఏకాంత సమయంలో దిగిన ఫొటోలను నెట్లో పోస్ట్ చేయడమే కాకుండా బంధువులకు పంపాడు. దీంతో పోలీసులకు చిక్కాడు.

