సంబంధిత వార్తలు
- కృష్ణాజిల్లాలో ఘోరం.. ప్రియుడి కోసం కన్నబిడ్డనే కడతేర్చిన మహిళ
- నా భార్య నాపై కేసు పెట్టింది.. ప్రియుడితో ఎంజాయ్ చేస్తోంది.. రండి సార్ చూపిస్తా..?
- భార్యతో స్నేహితుడి ఎఫైర్, లారీతో పదిసార్లు తొక్కించి చంపేసాడు
- అర్జున్ మేనల్లుడు చిరంజీవి సర్జా భార్య మేఘన సీమంతం, పక్కనే కటౌట్‌తో.. (video)
- నా భార్యే సర్వస్వం అనుకున్నా, కానీ పక్కింటి యువకుడు అందంగా ఉన్నాడనీ...
నూతన్ నాయుడు - మధుప్రియ మళ్లీ అరెస్టు...
విజయవాడలో ఓ దళిత యువకుడికి శిరోమడనం చేసిన కేసులో అరెస్టు అయిన టాలీవుడ్ చిత్ర నిర్మాత నూతన్ నాయుడు, ఆయన భార్య మధుప్రియలు మరోమారు అరెస్టు అయ్యారు. తొలుత శిరోమండన కేసులో వీరిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ దఫా ఓ మోసం కేసులో పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
ఉద్యోగాల పేరుతో తమ నుంచి రూ.25 లక్షలు వసూలు చేశారంటూ తూర్పుగోదావరికి చెందిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మధుప్రియ బెయిలు నుంచి విడుదలైన కాసేపటికే మళ్లీ ఆమెను అరెస్ట్ చేశారు. కోర్టు ఆమెకు ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది.
కాగా, తన ఇంట్లో పనిచేసి మానేసిన దళిత యువకుడు శ్రీకాంత్‌కు ఆగస్టు 28న ఇంట్లోనే శిరోముండనం చేయించిన ఘటన అప్పట్లో రాష్ట్రంలో పెను సంచలనమైన విషయం తెల్సిందే. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ కేసులో తొలుత మధుప్రియతోపాటు మరికొందరిని అరెస్టు చేయగా, పరారీలో ఉన్న నూతన్ నాయుడును ఆ తర్వాత అరెస్టు చేశారు. తాజాగా, మధుప్రియ బెయిలుపై బయటకు రాగా, కాసేపటికే చీటింగ్ కేసులో అరెస్టు చేశారు.
