శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 6 అక్టోబరు 2020 (22:37 IST)

భార్యతో స్నేహితుడి ఎఫైర్, లారీతో పదిసార్లు తొక్కించి చంపేసాడు

ఇద్దరూ ప్రాణస్నేహితులు. చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. ఒకరంటే ఒకరికి అమితమైన ఇష్టం. పెళ్ళి చేసుకునేటప్పుడు కూడా ఒకరికి నచ్చే మరొకరు చేసుకున్నారు. కానీ స్నేహితుడే తన భార్యను లొంగదీసుకుంటానని ఊహించలేకపోయాడు. విషయం కాస్త తెలిసి ప్రాణస్నేహితుడి ప్రాణం తీసేశాడు.
 
క్రిష్ణాజిల్లా బొబ్బలికి చెందిన రామ్ గోపాల్, నాగేంద్రబాబులు స్నేహితులు. రామ్ గోపాల్ బాగా చదువుకుని ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేసి ఇండియాకు తిరిగొచ్చాడు. నాగేంద్ర లారీని కొని నడుపుకుంటున్నాడు. రామ్ గోపాల్‌కు ఇంకా వివాహం కాలేదు.
 
నాగేంద్రబాబుకు అమ్మాయిని చూసి పెళ్లి చేసింది రామ్ గోపాలే. అంతలా ఇద్దరూ మంచి స్నేహితులు. అయితే కరోనా సమయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డ నాగేంద్రబాబు తిరిగి లారీలు నడుస్తుండటంతో సుదూర ప్రాంతాలకు వెళ్ళడం ప్రారంభించాడు. గత రెండు నెలలుగా పక్క రాష్ట్రాలకు వెళ్ళి వస్తున్నాడు.
 
ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తన భార్యకు ఏదైనా వస్తువులు కావాలంటే సహాయం చేయమని కోరాడు నాగేంద్రబాబు. దీంతో తరచూ రామ్ గోపాల్, నాగేంద్ర బాబు ఇంటికి వెళ్లి వస్తూ ఉండేవాడు. అయితే రామ్ గోపాల్ తన స్నేహితుడి భార్యకి దగ్గరయ్యాడు.
 
ఇద్దరిమధ్య వివాహేతర సంబంధం నడిచింది. విషయం కాస్త నాగేంద్రబాబుకు తెలిసింది. సరిగ్గా మూడురోజుల క్రితం గుజరాత్ నుంచి తిరిగి ఇంటికి వచ్చాడు. తన భార్య స్నేహితుడితో కలిసి ఉందన్న విషయాన్ని తనకు తెలియదన్నట్లుగానే సైలెంట్‌గా ఉన్నాడు.
 
రామ్ గోపాల్‌కు ఫోన్ చేసి పార్టీ ఇస్తానని రమ్మన్నాడు. అతను రాగానే అతనితో కలిసి మద్యం తీసుకుని బొబ్బిలి సమీపంలోని మారుమూల ప్రాంతంలోకి లారీలో ఇద్దరూ కలిసి వెళ్ళారు. రాంగోపాల్‌కు పూటుగా మద్యం సేవించేలా చేశాడు. అతను అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు.
 
దీంతో నాగేంద్రబాబు లారీతో రాం‌గోపాల్‌ను పదిసార్లు తొక్కించి తొక్కించి నుజ్జునుజ్జు చేసి చంపేసి ఇంటికి వచ్చేశాడు. ఉదయాన్నే రోడ్డుపై రోడ్డుపై శవాన్ని చూసి స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుంటే గుర్తు పట్టలేని విధంగా మృతదేహం ఉంది. అయితే పోలీసు స్టేషన్లో రాంగోపాల్ కనిపించలేదన్న ఫిర్యాదు ఆధారంగా ఆ మృతదేహం అతనిదేనని భావించి విచారణ ప్రారంభించారు. దీంతో నాగేంద్రబాబు నిందితుడిగా తేల్చారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు.