శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 అక్టోబరు 2020 (14:08 IST)

స్ట్రీట్ ఫుడ్ అంటే ఇష్టపడి తింటున్నారా..? స్విగ్గీతో కేంద్రం.. ఎందుకు?

స్ట్రీట్ ఫుడ్ అంటే ఇష్టపడుతున్నారా..? అయితే మీకు ఇదో గుడ్ న్యూస్. తమకు ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్‌ను బయటికి వెళ్లి తినాలనే కోరిక కొందరికి వుంటుంది.  అయితే కరోనా వ్యాప్తి కారణంగా అది ఇప్పుడు సాధ్యం కాదు. అయితే త్వరలోనే వారికి ఇంటి వద్దనే ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్‌ను రుచి చూసే అవకాశం రానుంది. ఇందులో భాగంగానే ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీతో కేంద్ర ప్రభుత్వం చేతులు కలుపుతోంది. 
 
మొదటగా దేశ రాజధాని ఢిల్లీ, అహ్మదాబాద్, చెన్నై, ఇండోర్, వారణాసి నగరాల్లోని ప్రజలు ఈ స్ట్రీట్ ఫుడ్‌ను వీధి వ్యాపారాల నుంచే ఇంటి వద్దకు డెలివరీ పొందనున్నారు. తొలుత ఈ ఐదు నగరాల్లోని 250 వీధి వ్యాపారాలను పైలెట్ ప్రాజెక్టులో భాగంగా కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ ఆన్‌లైన్‌లోకి తీసుకురానుంది. వారికి పాన్ కార్డు, రిజిస్ట్రేషన్, యాప్స్ వాడకం, మెనూ డిజిటలైజేషన్, ధరలు, ప్యాకేజింగ్ వంటి వాటిపై శిక్షణ ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం సహాయం చేయనుంది. 
kabab
 
పీఎంఎస్వీ ఆత్మనిర్భర్ నిధి స్కీమ్ కింద వీధి వ్యాపారాలకు రూ. 10 వేలు వర్కింగ్ క్యాపిటల్ కూడా ఇస్తోంది. స్ట్రీట్ ఫుడ్ విక్రేతదారులు, వేలాది మంది వినియోగదారులను ఆన్‌లైన్‌లో చేర్చేందుకు ఈ పథకాన్ని ప్రైమ్‌ మినిస్టర్‌ స్ట్రీట్‌ వెండర్స్‌ ఆత్మ నిర్భర్‌నిధి కిందకు తీసుకువస్తున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది.