శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 అక్టోబరు 2020 (09:51 IST)

మహిళా నిరుద్యోగులకు శుభవార్త.. అంగన్వాడీల్లో 5,905 పోస్టుల భర్తీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్‌వాడీల ద్వారా చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తోంది. ఈ క్రమంలో అన్ని కేంద్రాల్లో సిబ్బంది కొరత ఉండకూడదని భావిస్తోంది. ఈ క్రమంలో అన్ని కేంద్రాల్లో సిబ్బంది కొరత ఉండకూడదని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఏపీ మహిళా నిరుద్యోగులకు కూడా శుభవార్తను వినిపించారు. 
 
అదేంటంటే..? అంగన్వాడీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 5,905 పోస్టులను జిల్లాల వారీగా భర్తీ చేస్తామని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. దరఖాస్తులను ఆహ్వానించి ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. హెల్పర్లు, వర్కర్లను ఈ దఫా నియమించనున్నారు.
 
ఈ మేరకు అర్హులైన వారిని ఎంపిక చేసి నియమిస్తామని ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కృతికా శుక్లా తెలిపారు. 4,007 అంగన్‌వాడీ హెల్పర్లు, 430 మినీ అంగన్‌వాడీ వర్కర్లు, 1,468 మెయిన్‌ అంగన్‌వాడీ సిబ్బందిని నియమించనున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నియామకం కూడా చేశామని తెలిపారు. అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.