శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 30 డిశెంబరు 2017 (10:39 IST)

పవర్ స్టార్‌ పవన్ కల్యాణ్‌కు కాల సర్పదోషం.. సీఎం యోగం లేనట్టేనా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు కాలసర్ప దోషం వుందని.. దాని నుంచి తప్పించుకుంటేనే 2019 ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి కావడం కష్టమేనని ఓ ప్రముఖ జ్యోతిష్యుడు చెప్పినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు కాలసర్ప దోషం వుందని.. దాని నుంచి తప్పించుకున్నా.. 2019 ఎన్నికల్లో సీఎం ఆయన ముఖ్యమంత్రి కావడం కష్టమేనని  ఓ ప్రముఖ జ్యోతిష్యుడు చెప్పినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

పవర్ స్టార్ త్రయంబకేశ్వరం వెళ్లి నారాయణ నాగబలి పూజ చేసుకుంటే కొంత కష్టాలు తొలగిపోతాయని, కొత్త సంవత్సరం మంచి ఫలితాలను ఇవ్వడంతో పాటు 2019 ఎన్నికల్లో ఆయన రాణించే అవకాశం ఉన్నట్లు జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
2019 ఎన్నికల తర్వాత పవన్‌కు సీఎం అయ్యే యోగం లేదని, ఆయన రాజకీయ జీవితానికి గ్రహాలు అనుకూలంగా లేవని ఓ జ్యోతిష్యుడు వెల్లడించినట్లు మీడియాలో గుప్పున ప్రచారం సాగుతోంది. జనసేన పార్టీ పెట్టి దూసుకుపోవాలన్న యోచనలో వున్న పవన్ కళ్యాణ్.. ఈ మాటల్ని ఎంతవరకు నమ్ముతారనే విషయాన్ని పక్కనబెడితే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తరహాలో చండీయాగం వంటివి చేసుకుంటే కొన్ని సర్దుకుంటాయని చెప్పారు. అయితే పవన్ ఫ్యాన్స్ మాత్రం ఆయన సీఎం అవుతారని.. ఇలాంటి మాటలను పట్టించుకోమని చెప్తున్నారు.