మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 27 డిశెంబరు 2017 (09:15 IST)

పవన్ ఎప్పుడు నిలబడతాడో.. ఎక్కడ నిలబడతాడో ఎవ్వరికీ అర్థం కాదు: ఏబీకే

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై ప్రముఖ సంపాదకులు, రాజకీయ విశ్లేషకులు ఏబీకే ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎప్పుడు నిలబడతాడో.. ఎక్కడ నిలబడతాడో అనే విషయం ఎవ్వరికీ అర్థం కాని విషయమని

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై ప్రముఖ సంపాదకులు, రాజకీయ విశ్లేషకులు ఏబీకే ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎప్పుడు నిలబడతాడో.. ఎక్కడ నిలబడతాడో అనే విషయం ఎవ్వరికీ అర్థం కాని విషయమని ప్రసాద్ అన్నారు.

అంతేగాకుండా పవన్ గురించి మాట్లాడటమే అనవసరమని ఏబీకే సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన గురించి తడవడమే అనవసరమని తెలిపారు. కొందరు లేస్తే మనిషిని కాదంటారు, కానీ పవన్ కల్యాణ్ లేవడమే గగనమైపోయిందని చెప్పుకొచ్చారు. 
 
అలాగే వైకాపా చీఫ్ జగన్ పాదయాత్రపై స్పందించిన ఏబీకే ప్రసాద్.. వైఎస్ పాదయాత్ర చేస్తున్నప్పుడు వచ్చిన ప్రజా స్పందనతో పోలిస్తే, అధికంగా ప్రజలు వస్తున్నారని చెప్పుకొచ్చారు. పరిపాలకులుగా ఎవరున్నా ఓట్ల కోసం ఇచ్చిన హామీలను అమలు చేయడమే అసలైన పరీక్షని పేర్కొన్నారు.
 
ఇదిలా ఉంటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ఫాతిమా మెడికల్ కళాశాల విద్యార్థుల కోసం పవర్ ఫుల్ ట్వీట్స్ చేశారు. విద్యార్థులు నష్టపోకుండా న్యాయం చేయాలంటూ సీఎం చంద్రబాబును విజ్ఞప్తి చేస్తూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పవర్ ఫుల్ పంచ్‌లు విసిరారు. విద్యార్థులు తమ విలువైన విద్యాసంవత్సరాన్ని కోల్పోతుంటే ప్రజలచేత ఎన్నికైన ప్రభుత్వాలు తదుపరి ఎన్నికల కోసం వ్యూహాలు రచించడంలో బిజీగా ఉన్నాయని పవన్ విమర్శించారు. 
 
ఫాతిమా కాలేజీ యాజమాన్యం తప్పిదం కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడకూడదని పవన్ వ్యాఖ్యానించారు. విద్యార్థులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని బాబును కోరారు. అమాయకులైన విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన ఫాతిమా కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ డిమాండ్ చేశారు.