1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Police Cracked the Rajednra Nagar House Robbery Case

ప్రియుడి కోసం తండ్రికే మస్కా కొట్టిన కుమార్తె.. ఏం చేసిందంటే...

ప్రియుడితో సొంత వ్యాపారం చేయించాలన్న ఉద్దేశ్యంతో సొంత ఇంట్లోనే డబ్బు కొట్టేసిన కిలాడీ యువతి బండారాన్ని పోలీసులు బహిర్గతం చేశారు.

Rajednra Nagar House Robbery Case
ప్రియుడితో సొంత వ్యాపారం చేయించాలన్న ఉద్దేశ్యంతో సొంత ఇంట్లోనే డబ్బు కొట్టేసిన కిలాడీ యువతి బండారాన్ని పోలీసులు బహిర్గతం చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... హైదరాబాద్ రాజేంద్ర నగర్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ముజఫర్ ఇంట్లో ఈ నెల 3వ తేదీన నలుగురు దుండగులు వచ్చి అతని కుమార్తె తస్కింబాను(20)ను కొట్టి రూ.22 లక్షల నగదు దోచుకుని వెళ్లారు. ముజఫర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేసిన పోలీసులు ముజఫర్ కూతురే అసలు సూత్రదారి అని తేల్చారు.
 
శంషాబాద్‌కు చెందిన అష్రఫ్(22) అనే యువకుడిని తస్కీంబాను ప్రేమించింది. వారిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అష్రఫ్ వ్యాపారం చేస్తేనే తన తండ్రి పెళ్ళికి ఒప్పుకుంటాడని భావించింది. వ్యాపారం చేసేందుకు పెద్ద మొత్తంలో డబ్బు అవసరం కావడంతో ఏదో విధంగా సర్దుబాటు చేయాలని భావించింది. 
 
ఈ క్రమంలోనే తండ్రి తన వ్యాపారంలో భాగంగా ఓ ప్లాటును అమ్మగా వచ్చిన డబ్బును ఇంట్లో పెట్టడాన్ని తస్కీంబాను గమనించింది. అష్రఫ్‌ను పిలిచి రూ.22 లక్షల డబ్బు ఇచ్చి పంపింది. అనంతరం తనకు తానే గాయాలు చేసుకుని.. ఇంట్లోకి నలుగురు దొంగలు వచ్చి తనను కొట్టి డబ్బు పట్టుకుపోయారని తండ్రితో పాటు.. కుటుంబ సభ్యులను నమ్మించింది. దీనిపై తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన విచారణ చేపట్టిన పోలీసులు అసలు నిజాన్ని తెలుసుకుని అవాక్కయ్యారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
వాట్సాప్‌లో విటుని ఫోటో చూశాకే ఓకే చెబుతున్న వ్యభిచారిణిలు...