సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 6 ఆగస్టు 2018 (11:29 IST)

తెలుగు రాష్ట్రాల్లో వ్యభిచార దందా... పుణ్యక్షేత్రాలే అడ్డాగా...

తెలుగు రాష్ట్రాల్లో వ్యభిచార దందా జోరుగా సాగుతోంది. ఫలితంగా వ్యభిచార కేంద్రం నిర్వాహకుల సంపాదన మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాల్లో వ్యభిచారం

తెలుగు రాష్ట్రాల్లో వ్యభిచార దందా జోరుగా సాగుతోంది. ఫలితంగా వ్యభిచార కేంద్రం నిర్వాహకుల సంపాదన మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాల్లో వ్యభిచారం విచ్చలవిడిగా సాగుతోంది.


జాతీయ రహదారుల వెంట ఉండే ధాబాలు, మద్యం దుకాణాల పరిసరాలూ పడుపు స్థావరాలుగా మారాయి. గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న సోదాల్లో ఈ వ్యభిచార దందా కేసులు వరుసగా వెలుగు చూస్తున్నాయి.
 
ఇటీవల పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలోని వ్యభిచార గృహాలపై సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో నిర్వాహకులు తొలుత వాటిని సాధారణ దాడులుగానే పరిగణించారు. ఆ తర్వాత రోజు నుంచి పోలీసులు బాలికల వివరాలను ఆరా తీస్తుండడంతో అప్రమత్తమయ్యారు. సుమారు వందమంది బాలికలను తీసుకుని మరో వంద మందికిపైనే యువతులు, నిర్వాహకులు ఇతర ప్రాంతాలకు పరారయ్యారు. 
 
జానికి, పోలీసులు దాడులు చేసినప్పుడు వ్యభిచార గృహాల్లోని యువతులను ఇతర ప్రాంతాలకు తరలిస్తూ ఉంటారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత తిరిగి తీసుకొస్తారు. ఇప్పుడు కూడా ఇతర ప్రాంతాల్లో మరికొందరు బాలికలు ఉండి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
 
అలాగే, ఆయా ప్రాంతాల్లోని వ్యభిచార గృహాల మధ్య పరస్పర అవగాహన ఉంది. ఆయా కేంద్రాల మధ్య వేశ్యలను పరస్పరం మార్చుకుంటారు. సంతలో పశువుల మాదిరిగా యువతుల క్రయవిక్రయాలు కూడా జరుగుతాయి. మొత్తంమీద వ్యభిచార దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపారని చెప్పొచ్చు. 
 
తెలుగు రాష్ట్రాల్లో వ్యభిచార దందా... పుణ్యక్షేత్రాలే అడ్డాగా...
పడుపు వృత్తి కేంద్రాలుగా ధాబాలు... జోరుగా వ్యభిచారం
తెలుగు రాష్ట్రాల్లోని వ్యభిచార కేంద్రాలపై ఉక్కుపాదం