లొకాంటో వెబ్‌సైట్ ద్వారా విటుల ఆకర్షణ.. గుట్టుచప్పుడు కాకుండా...

romance
ఠాగూర్| Last Updated: మంగళవారం, 14 జనవరి 2020 (10:14 IST)
లొకాంటో వెబ్‌సైట్ ద్వారా విటులను ఆకర్షిస్తూ గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార దందాను నిర్వహిస్తూ వచ్చిన ముఠాను హదైరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, ఎస్సార్ నగర్‌కు చెందిన చిట్టి, చరణ్ అనే వ్యక్తులు లొకాంటో అనే మల్టీపర్పస్ వెబ్‌సైట్‌‌లో అందమైన అమ్మాయిన ఫోటోలను అప్‌లోడ్ చేశారు. ఈ అమ్మాయిలను కావాలనుకున్నవారు సంప్రదించేందుకు వీలుగా ఫోన్ నంబర్లను ఇచ్చారు.

ఈ అమ్మాయిల ఫోటోలను చూసిన కొందరు యువకులు ఆకర్షితులై చిట్టి, చరణ్‌లను సంప్రదించేవారు. అలా విటులను ఆకర్షించి గుట్టుచప్పుడు కాకుండా బీకేగూడలో వ్యభిచారం కొనసాగిస్తూ వచ్చారు. దీనికి సంబంధించి పక్కా సమాచారం అందుకున్న పోలీసులు వ్యభిచార గృహంపై దాడిచేశారు.

ప్రధాన నిందితుడు చరణ్ తప్పించుకోగా మరో నిర్వాహకుడు చిట్టి, విటులు ఎస్.సాయికుమార్, జె.కార్తీక్, ఎం.విఘ్నేష్‌లతోపాటు ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న చరణ్ కోసం గాలిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :