సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 జనవరి 2020 (14:53 IST)

సంక్రాంతి శోభ : టోల్ ప్లాజాల వద్ద బారులు తీరిన వాహనాలు

సంక్రాంతిని పురస్కరించుకొని ప్రయాణీకులు తమ స్వంత ఊళ్లకు బయలుదేరారు. దీంతో టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులుతీరాయి. దీంతో ఆదివారం నాడు ఉదయం నుండే విజయవాడ-హైద్రాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయింది. ఉమ్మడి నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి లోట్ ప్లాజా, విజయవాడకు సమీపంలోని పొట్టిపాడు టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జాం అయింది.
 
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని తమ స్వంత ఊళ్లకు బయలుదేరారు. ఆదివారం నుండి సెలవులు కావడంతో ఎక్కువ మంది ఇవాళ ఉదయం నుండి స్వంత ఊళ్లకు బయలుదేరారు. టోల్ ప్లాజా వద్ద ఫాస్టాగ్ వద్దతిని అమలు చేసినా కూడ ప్రయాణీకులకు తిప్పలు తప్పలేదు. 
 
పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఆదివారం నాడు ఉదయం నుండే సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం అయింది. ఫాస్టాగ్  ఉన్నా కూడ వాహనదారులు టోల్ ప్లాజా వద్ద ఎదురు చూడాల్సి వచ్చింది. ఇక ఫాస్టాగ్ సౌకర్యం లేనివారు ఎక్కువసేపు ఎదురు చూడాల్సి వస్తోందని ప్రయాణీకులు చెబుతున్నారు. ప్రయాణీకుల రద్దీ పెరిగే అవకాశం ఉన్న విషయాన్ని గుర్తించి ముందు జాగ్రత్తలు తీసుకొంటే పరిస్థితి మరోలా ఉండేదని ప్రయాణీకులు అభిప్రాయపడుతున్నారు. 
 
ఇక విజయవాడకు సమీపంలోని పొట్టిపాడు టోల్‌ప్లాజా వద్ద ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. పొట్టిపాడు టోల్‌ప్లాజా వద్ద కూడ సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి.