1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Rain alert for three days in ap

ఏపీ ప్రజలకు చల్లని కబురు.. వరుణుడు వచ్చేస్తున్నాడు...

Rains
ఏపీలో భానుడు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాడు. అయితే ఇంతలో వరుణుడు ఏపీ ప్రజలకు చల్లని కబురు చెప్పేలా చేశాడు. అవును ఉక్కపోతతో విలవిల్లాడుతున్న ప్రజల కోసం వరుణుడు కరుణించనున్నాడు. ఇందులో భాగంగా ఏపీలో వర్షాలు కురువనున్నాయి. 
 
ఏపీలోని కొన్ని ప్రాంత ప్రజలకు ఎండల నుంచి ఉపశమనం కలిగించేలా అమరావతి వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణలో దక్షిణ, నైరుతి గాలులు వీస్తున్నాయని తెలిపింది. ఈ గాలుల ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన చేసింది.
 
ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాంతో పాటు దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమలో  మంగళ, బుధవారాల్లో వర్షాలు పడే అవకాశం వున్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు.  
About Writer
సెల్వి
తర్వాతి కథనం
ఎంపిక చేసిన ప్రాంతాల్లో కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభించిన మాండలిజ్ ఇండియా