మంగళవారం, 8 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (08:39 IST)

ఏపీలో కరెంట్ కష్టాలు - పరశ్రమలకు 2 వారాలు పవర్ హాలిడే

power supply
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే కరెంట్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. చేతికొచ్చిన పంటకు నీరు కట్టేందుకు కరెంట్ లేక రైతులు కన్నీరు కార్చుతున్నారు. ఇపుడు పరిశ్రమల వంతు వచ్చింది. పరిశ్రమలకు రెండు వారాల పాటు పవర్ హాలిడే ప్రకటించింది. 
 
వేసవికాలం ప్రారంభంకాగానే విద్యుత్ కోతలు మొదలయ్యాయి. వేసవి నేపథ్యంలో విద్యుత్ వినియోగం పెరిగిన నేపథ్యంలో గృహావసరాలకు ఇబ్బంది కలగకుండా ఉండేలా పరిశ్రమలకు పవర్ హాలిడేలను ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్పీడీసీఎల్) ప్రకటించింది. ఈ మేరకు సీఎండీ హరనాథ రావు గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఆదేశాలు ఏపీడీఎస్పీడీసీఎల్ పరిధిలోని పరిశ్రమలకు మాత్రమే వర్తిస్తాయి. 
 
ఏపీడీఎస్పీడీసీఎల్ సీఎండీ జారీచేసిన ఆదేశాల మేరకు 253 ప్రాసెసింగ్ పరిశ్రమలు 50 శాతం విద్యుత్‌నే వాడాల్సి ఉంటుంది. 1696 పరిశ్రమలకు వారంలో ఒక రోజు పవర్ హాలిడేను అమలు చేయాలి. వారాంతపు సెలవుకు అదనంగా ఒక రోజు పవర్ హాలిడేను కొనసాగించాలి. ఈ నెల 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రెండు వారాల పాటు అన్ని పరిశ్రమలకు పవర్ హాలిడేను ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు.