శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 మార్చి 2022 (19:36 IST)

ఏప్రిల్ నెలలో బ్యాంకులకు సెలవులే సెలవులు

2021-22 ఆర్థిక సంవత్సరం మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం 2022-23 ప్రారంభంకానుంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో బ్యాంకులకు దండిగా సెలవులు వస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో 11 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. దేశ వ్యాప్తంగా 15 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. అయితే, ఈ సెలవుల్లో ఆన్‌లైన్ సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయి. 
 
తెలుగు రాష్ట్రాల్లోని ఈ సెలవుల వివరాలను పరిశీలిస్తే, 
ఏప్రిల్ 1 - ఆర్థిక సంవత్సరానికి సంబందించి  అకౌంట్స్ క్లోజింగ్ డే
ఏప్రిల్ 2 - తెలుగు నూతన సంవత్సరం ఉగాది
ఏప్రిల్ 3 - ఆదివారం (సాధారణ సెలవు)
ఏప్రిల్ 5 - బాబు జగ్జీవన్ రామ్ జయంతి
ఏప్రిల్ 9 - రెండో శనివారం (సాధారణ సెలవు)
ఏప్రిల్ 10 - ఆదివారం (సాధారణ సెలవు)
ఏప్రిల్ 14 - డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి
ఏప్రిల్ 15 - గుడ్‌ఫ్రైడే 
ఏప్రిల్ 17 - ఆదివారం (సాధారణ సెలవు)
ఏప్రిల్ 23 - నాలుగో శనివారం (సాధారణ సెలవు)
ఏప్రిల్ 24 - ఆదివారం (సాధారణ సెలవు)