సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 మార్చి 2022 (18:35 IST)

8న వనపర్తి జిల్లాలో స్కూల్స్ వుండవా?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 8న వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో డీఈవో రవీందర్ సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ బహిరంగ సభకు పాఠశాలల బస్సులు పంపించాలని, టీచర్లు కూడా రావాలని డీఈవో కోరారు.
 
ఆ రోజు స్కూళ్లు ఉంటాయని, బస్సులు ఎలా పంపాలని యాజమాన్యం ప్రశ్నించింది. బస్సులు లేకుంటే పాఠశాలకు విద్యార్థులు ఎలా వస్తారని, ఇది అనధికార సెలవేనన్న సందిగ్ధంలో స్కూళ్ల యాజమాన్యాలు వున్నాయి.